నయనతార (Nayanthara), విఘ్నేష్‌లు నిన్నే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భార్యభర్తలుగా ఈ కొత్తజంట ఈ రోజే తిరుమల ప్రాకారంలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయమే తిరుమల కొండకు శ్రీవారి ఆశీర్వాదం కోసం వచ్చిన నయన్, విక్కీల జంట తొలుత తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం) లోని పలు ఆలయాలను సందర్శించారు.
ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన జంటను ఆశీర్వదించారు. ఇదే క్రమంలో, నయన్, విక్కీలకు తీర్థప్రసాదాలు అందజేశారు.
కొత్త పెళ్లికూతురు నయనతార (Nayanthara) పసుపు రంగు చీరలో దైవ దర్శనానికి వెళ్లారు. మెడలో తాళి, కాలికి మెట్టెలతో నయనతార కనిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్, విక్కీల వివాహం జరిగిన విషయం విదితమే.
మొదట తిరుమల శ్రీవారి సన్నిధిలోనే నయన్ దంపతులు వివాహం చేసుకోవాలనుకున్నారు. అందుకే, వీరి పెళ్లి ఆహ్వాన పత్రికను కూడా మొదట శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంతనే ఉంచారు. అయితే తిరుమల రద్ధీనీ దృష్టిలో పెట్టుకుని.. వీఐపీలు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించకూడదని.. పెళ్లి మండపాన్ని మార్చారు.
తమిళనాడులోని మహాబలిపురంలో జూన్ 9న ఉదయం 8 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నయనతార (Nayanthara), విఘ్నేష్‌ల వివాహానికి హాజరయ్యారు.
Read More: నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !
Follow Us