తన నటన, అభినయంతో ప్రేక్షకుల అభిమానానికి దగ్గరయ్యాడు యువ హీరో అడివి శేష్ (Adivi Sesh). టాలీవుడ్‌లో థ్రిల్లర్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. లేటెస్ట్‌గా అడివి శేష్ నటించిన సినిమా ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘గూఢచారి’ ఫేం శశికిరణ్ తిక్కా మేజర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నమోదు చేశాయి. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమా అప్‌డేట్స్‌ను చిత్ర బృందం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ప్రచారం చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
మేజర్ చిత్రంలోని సాతియా అంటూ సాగే మెలోడి వీడియో సాంగ్‌ను మే25 ఉదయం11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదివరకే విడుదలైన ఈ పాట లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ ఏయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా..శోభితా ధూళిపాళ కీలకపాత్రలో నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
అడివి శేష్ ట్విటర్‌లో అభిమానులు, సినీ ప్రేమికులతో చిట్‌చాట్ చేశాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘మనకు తెలియని సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని మేజర్ సినిమాలో చూపించాం. 'క్షణం' 'గూఢచారి', 'ఎవరు' ఈ సినిమాలను మించి 'మేజర్' ఉంటుంది. ఈ సినిమాకు టికెట్ రేట్లు సాధారణంగానే ఉంటాయి. సామాన్యులు చూడాల్సిన అసాధారణ చిత్రమిది’ అని చెప్పాడు శేష్.
మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఏడిపిస్తుండడంతో అడివి శేష్‌గా మార్చుకున్నాను అని చెప్పాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్ హీరో కాలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇండియన్స్ కమెడియన్ రోల్స్‌లోనే కనిపిస్తారని అన్నాడు అడివి శేష్ (Adivi Sesh).
Follow Us