టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఏషియన్ గ్రూప్ అధినేత, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, గ్లోబల్ సినిమా స్థాపకుడు మూవీ ఫైనాన్షియర్ నారాయణ్ దాస్ నారంగ్ మరణించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్టార్ హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం నారంగ్ మృతిచెందారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’, నాగశౌర్య, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా చేసిన ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు.
ఇక ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’తోపాటు, ధనుష్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారంగ్ పార్థివదేహానికి హీరో నాగార్జున, నిర్మాతలు సురేష్‌బాబు, సుధాకర్‌రెడ్డి, దర్శకుడు శేఖర్ కమ్ముల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నారంగ్ ఇద్దరు కొడుకులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలుగా ఉన్నారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నారంగ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Follow Us