తమ అభిమాన హీరో సినిమా రిలీజవుతుందంటే చాలు భారీ కటౌట్లు, టపాసులతో నానా హంగామా చేసేవాళ్లు అభిమానులు. ఇక మెగా అభిమానుల గురించి చెప్పేదేముంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా రాబోతోందంటే చాలు కళ్లుచెదిరే కటౌట్లు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలతో థియేటర్ల ముందు కోలాహలంగా ఉండేది.మెగాస్టార్ సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లకు మినిమం గ్యారెంటీ ఉండేది.
అయితే ఇప్పుడు సీన్ మారింది. మారిన పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికత, ఓటీటీలు, యూట్యూబ్.. కారణాలేవైనా సినిమాలో ఉన్న హీరోలకంటే కథకి, కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. డైరెక్షన్, ఎడిటింగ్, కాస్టూమ్స్‌తో సహా ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాజాగా భారీ అంచనాల మధ్య రిలీజైన ఆచార్య దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ తింది. తండ్రీకొడుకులైన చిరంజీవి, రామ్‌చరణ్ పూర్తిస్థాయిలో కలిసి నటించిన ఈ సినిమా ఫలితం చూసి మెగాస్టార్ ఖంగుతిన్నారు. తదుపరి చిత్రాల సంగతేంటనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది.
కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకత్వం వహించింది నాలుగు సినిమాలే. కానీ, ఆ నాలుగు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నారు. ఎందుకంటే, ఆ సినిమాల్లో ఉన్న కంటెంట్ అలాంటిది. ఇలాంటి దర్శకుడి నుంచి మెగాస్టార్ హీరోగా సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. కానీ, ఆ అంచనాలను శివ తారుమారు చేసేశారు. అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్నంతగా నీరుగార్చేశారు. బలంగా చూపించే కంటెంట్ నీరసించిపోవడం పెద్ద మైనస్. కంటెంట్ బాగోలేనప్పుడు ఎన్ని ఎలివేషన్స్ ఉన్నా దండగే అనడానికి ‘ఆచార్య’ పెద్ద ఉదాహరణ.
క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ ప్రాజెక్టు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ధర్మస్థలి అనే ఊరు చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఒకప్పుడు ఖైదీ నంబర్ 150 తో ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుండే రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ తర్వాత సైరా నరసింహా రెడ్డి తో కూడా దుమ్ము దుమారం లేపగా ఇటు పక్క రంగస్థలం తో సంచలనం సృష్టించిన రామ్ చరణ్ వినయ విదేయ రామతో భారీ ఎదురుదెబ్బ తిన్నా కానీ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన…ఆర్ ఆర్ ఆర్ తో రికార్డులను తిరగరాసిన తర్వాత ఆడియన్స్ ముందుకు అపజయం అంటే తెలియని కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య మాత్రం ఆడియన్స్ ని థియేటర్స్ కి అస్సలు తీసుకు రాలేక పోతుంది. సినిమా ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాడ్ రికార్డులను నమోదు చేస్తుంది.
చిరు సినిమా మూడేళ్ల తర్వాత వచ్చినా ఆదరణ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని మెగాస్టార్ కన్ఫర్మ్ చేసేశారు.
చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం రవితేజ 16 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు , అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక మరో యంగ్ హీరో తో ముందుకు వెళ్దాము అనే ఆలోచనతో రవితేజ ఈ సినిమా నుండి తప్పించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.ఆచార్య ఎఫెక్ట్ వలన అంత బడ్జెట్ ను నిర్మాణ సంస్థ మోయలేమని చేతులు ఎత్తేసిందని, దీంతో రవితేజను తప్పించేసి ఆ ప్లేస్ లో యంగ్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆచార్య హక్కులు కొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు గాడ్‌ఫాదర్ హక్కులను ఇవ్వాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పదేళ్ల గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం గాడ్‌ఫాదర్, భోళాశంకర్, వాల్తేర్ వీరయ్య షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ ఘనవిజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్‌చరణ్ కూడా వరుస ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. ఆచార్య సినిమా ఫలితం ఎలా ఉన్నా రామ్ చరణ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
Follow Us