సినీ గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose)కు సినారె లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేస్తున్న గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose)కు మరో అరుదైన గౌరవం దక్కింది

ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose)​ ‘తాజ్​మహల్​’ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టారు. అన్ని వయసుల వారిని అలరించేలా అనేక పాటలు రాసి ప్రశంసలందుకున్నారు చంద్రబోస్​. గేయరచయితగా అనేక అవార్డులు అందుకున్న చంద్రబోస్​కి మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఙానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అందజేశారు. ‘ ఏ కాలంలోలైనా విభిన్నమైన శైలితో జనాన్ని ఒప్పించడమే మంచి కవి లక్షణం’ అన్నారు మంత్రి నిరంజన్​ రెడ్డి.

బంజారాహిల్స్‌లో..

బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా.. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డా.ఎస్‌పీ.భారతితో కలిసి చంద్రబోస్‌కు పురస్కారాన్ని అందజేశారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబోస్‌ పాటలు నచ్చని తెలుగువారు ఉండరని, భారతీయ సాహిత్య రంగంలో శిఖరంగా నిలిచిన సినారె పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడానికి చంద్రబోస్‌కు అన్ని విధాల అర్హత ఉందన్నారు. సినారె బాటలో పయనిస్తూ అనేక మరపురాని గీతాలను తెలుగువారికి అందించిన ఘనత చంద్రబోస్‌(Chandrabose)కు దక్కుతుందన్నారు.

Read More : జేమ్స్‌బాండ్‌గా హాలీవుడ్‌కి మెగా పవర్​స్టార్ రాంచ‌ర‌ణ్‌ (RamCharan).. ఆనందంలో మెగా అభిమానులు!

You May Also Like These