కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా రాకీభాయ్ కోలార్ మైన్స్ కొల్లగొట్టిన డాన్ థంగం రౌడీదా? థంగం రౌడీ జూనియర్ వీరప్పన్ ఎలా అయ్యారు. థంగం డాన్‌పై ఇంతకు ముందే సినిమా వచ్చిందా?
హీరో యశ్ నటించిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 ఇండియన్ సినిమాలో అతి పెద్ద హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్2 స్టోరీ, డైలాగ్స్ థియేటర్లలో కేక పుట్టించాయి. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురుస్తుంది.
రియల్ రౌడీ థంగం
కేజీఎఫ్ 2 రాఖీభాయ్ కర్ణాటక చెందిన థంగం రౌడీనే అని అందరూ అంటున్నారు. థంగం కోలార్ మైన్స్‌లో పనిచేసేవాడు. ఓ గ్యాంగ్‌తో బంగారాన్ని దోచేసేవాడు. అడ్డొచ్చిన మైన్స్ ఓనర్స్‌పై దాడి చేసి బంగారాన్ని ఎత్తికెళ్లేవాడు. కాజేసిన బంగారం అందరికీ పంచుతూ థంగం రౌడీ జూనియర్ వీరప్పన్ అయ్యాడు.
థంగం గ్యాంగ్‌ను పౌలి గ్యాంగ్ అని పిలిచేవారట. నాలుగేళ్లలో 42 కేసులు థంగంపై నమోదయ్యాయి. కనిపిస్తే కాల్చి వేయాలని అప్పట్టో పోలీసులు ఆదేశించారు. ఎంత బంగారం కొల్ల గొడితే ఇన్ని కేసులు పెట్టారో. అయితే థంగానికి ప్రజల సపోర్టు చాలా ఉండేది. చివరికి పోలీసుల ఎన్‌కౌంటర్లో మరణించాడు.
రీల్ డాన్ రాఖీభాయ్
కోలార్ మైన్స్ కొల్లగొట్టిన థంగం రౌడీ కేజీఎఫ్2 రాఖీభాయ్ కాదని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. కేజీఎఫ్2లో రాఖీభాయ్ కల్పిత పాత్రనేనన్నారు. థంగం జీవితం ఆధారంగా వచ్చిన సినిమాకు కేజీఎఫ్2కు ఎలాంటి పోలిక లేదన్నారు. థంగం సినిమాలో తల్లి కీలక పాత్ర పోషించారు. కానీ రీల్ రాఖీభాయ్ తల్లి చిన్నప్పుడే చనిపోతుందని గుర్తుచేశారు. థంగం రౌడీకి, కేజీఎఫ్2 రాఖీభాయ్‌కి చాలా తేడా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్.
రీల్, రియలో కామన్ పాయింట్
రాఖీభాయ్, థంగం రౌడీ ఇద్దరూ కోలార్ మైన్స్ కొల్లగొట్టిన హీరోలే. ఒకరు రియల్ మరొకరు రీల్... కానీ వీరి టార్గెట్ బంగారం నిధులే. కేజీఎఫ్ చాప్టర్ 2 మాత్రం బంగారం లాంటి సినిమా అని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
Follow Us