ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కేజీఎఫ్–2 బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దులు కొడుతోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.546 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా గురువారం రిలీజైన కేజీఎఫ్–2 కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వారం రోజులు సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగితే, రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను కేజీఎఫ్–2 దాటేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన కేజీఎఫ్‌తో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ప్రపంచం రాఖీ భాయ్ సామ్రాజ్యం అని కేజీఎఫ్ మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేశారు. సినీ విమర్శకులు, ప్రముఖులు, ఆడియన్స్ కూడా సినిమాను బాక్స్ ఆఫీస్ మాన్స్టర్ అని పిలుస్తున్నారు. అంటే కేజీఎఫ్–2 క్రేజ్ ఎంతగా ఉందనేది అర్ధమవుతోంది.
ఇక, ఎటువంటి అంచనాలు లేకుండా 2018 డిసెంబర్ 21న రిలీజైన కేజీఎఫ్ పార్ట్–1 కూడా మేకర్స్‌కు లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Follow Us