'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ (Junior NTR) కలయికలో ఓ మూవీ రాబోతుంది. దీనిపై గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మరో అప్‌డేట్ కూడా వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సలార్' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. అయితే ఎంత ఆ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ వర్క్‌పై కూడా ఆయన ఫోకస్ పెట్టారట.
దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా షూటింగ్ షెడ్యూల్ పై అభిమానులకు ఆసక్తి ఏర్పడింది. ఇదే క్రమంలో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్. 2023 ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్‌తో తన సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తానని తెలిపారు.
పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో కథ
ఈ ఏడాది వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు భారతీయ సినిమా చరిత్రలోనే బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఇక ఆర్ఆర్ఆర్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ఓ సినిమా సైన్ చేశారనగానే.. తారక్ అభిమానులు చాలా ఖుషీ అయ్యారు.
ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు సైతం ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా కథ గురించి కూడా ఒక అప్‌డేట్ వచ్చింది. గతంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ సినిమా కథ సాగుతుందని టాక్.
మరో విషయమేమిటంటే, ప్రశాంత్ నీల్ సినిమాలో.. ఎన్టీఆర్ పాకిస్థానీగా నటించబోతున్నారట. తన పూర్వీకులు హిందువులు కావడం, అలాగే తనకు భారత్ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండటంతో ఎన్టీఆర్ ఇండియాకు వస్తారని.. ఇదే క్రమంలో ఆయన ఇండియా గెలుపు కోసం ఓ త్యాగం చేస్తారని చెబుతూ ఒక కథ ప్రస్తుతం నెట్టింట్లో ప్రచారమవుతోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ (Junior NTR) కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసం, వచ్చే ఏడాది తారక్ ఏకంగా 180 రోజుల డేట్స్ కేటాయించనున్నారు. 2023లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినా..అదే ఏడాది చివరిలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
Read More : ఎన్టీఆర్ (Junior NTR) సినిమా సెప్టెంబర్ నుంచైనా సెట్స్‌పైకి వెళ్లేనా? కొరటాల సినిమా షూటింగ్ స్టార్ట్ కాలే
Follow Us