సూర్య నటించిన జై భీమ్ (Jai Bhim) సినిమాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు అవార్డుల మీద అవార్డులు అందుతున్నాయి. బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అవార్డు సాధించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన జై భీమ్ (Jai Bhim) సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. సూర్య హీరోగా టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ అయింది. బెస్ట్ మూవీ అనిపించుకున్న జై భీమ్ అవార్డులను సాధిస్తుంది. ఇంతకు ముందు దాదా సాహేబ్ పాల్కే ఫిలీం ఫెస్టివల్‌లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా ఓ అవార్డు, మూవీలో నటించిన మణికందన్‌కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా మరో అవార్డు వచ్చింది.
జై భీమ్ (Jai Bhim) సినిమాకు మరో రెండు అవార్డులు వచ్చాయి. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో జై భీమ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాలో నటించిన లియోమోల్ జోస్‌కు ఇండీ స్పిరిట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఇండీ స్పిరిట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా జై భీమ్ సొంతం చేసుకుంది. మూవీ కెమెరామెన్ ఎస్.ఆర్. కదీర్‌కు ఈ అవార్డు దక్కింది.
సూర్య, జ్యోతిక కలిసి 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ జై భీమ్ సినిమా నిర్మించింది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు.
Follow Us