కొండవీటి దొంగ సినిమా చూశారా? అందులో చిరంజీవి పోషించిన రాబిన్ హుడ్ తరహా పాత్ర అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు అచ్చం అలాంటి పాత్రతోనే పవన్ కళ్యాణ్ తన అభిమానులకు కనువిందు చేయనున్నారు. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఉన్నోడిని కొట్టు.. లేనోడికి పెట్టు అనే సూత్రమే ఇలాంటి సినిమాలకు ప్రధానమైన పాయింట్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా కత్తిసాము కూడా నేర్చుకున్నారు. అదొక్కటే.. కాదు ఇదే సినిమాలో చాలా విశేషాలున్నాయి.
రెండు కాలాల మధ్య నడిచే కథ:
రెండు విభిన్న కాలాల మధ్య జరిగే కథ ఈ సినిమాకి హైలెట్ అని విమర్శకులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మొఘల్ సామ్రాజ్యపు ఎపిసోడ్ ఈ చిత్రానికి ఎంతో కీలకమట. అంటే ఒక రకంగా చారిత్రక సినిమా కోణం కూడా ఇందులో ఉంటుంది.
క్రిష్ దర్శకత్వ ప్రతిభ మరోసారి:
గౌతమీపుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్‌కు ఇలాంటి సబ్జెక్టులు కొట్టిన పిండి అని చెప్పుకోవచ్చు. మరి, అలాంటి దర్శకుడితో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే కదా. అలా కథ కూడా కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుందని ఇట్టే చెప్పేవయచ్చు.
కథానాయికతో యుద్ధ విన్యాసాలు:
ఈ చిత్రంలో హీరోయిన్ నిధి అగర్వాల్ చేత కూడా భారీ యాక్షన్ సన్నివేశాలలో నటింపజేశారని టాక్.
భారీ బడ్జెట్:
180 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించడం అనేది సవాలుతో కూడుకున్న పనే. కానీ పవర్ స్టార్ సినిమా కాబట్టి, ఆయన అభిమానులను ఆకట్టుకోవాలంటే, ఆ స్థాయి బడ్జెట్ అవసరమే.
ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్
ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్ (Arjun Rampal), అలాగే రోషనారాగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారని వార్తలొచ్చాయి.
హాలీవుడ్ వీఎఫ్ఎక్స్
ఆక్వామాన్, వార్ క్రాఫ్ట్స్, స్టార్ వార్స్ (Aquaman, War Crafts, Star Wars) లాంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ సాంకేతిక సహకారం అందించిన బెన్ లాక్ ఈ చిత్రానికి కూడా సారథ్యం వహించడం విశేషం. ఇది ఈ సినిమాకి మరో పెద్దబలం.
ఎ.ఎం రత్నం సమర్పణ
భారతీయుడు, స్నేహం కోసం, ఖుషీ, 7/G బృందావన్ కాలనీ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎ.ఎం రత్నం చాలా రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహించడం విశేషం
Follow Us