భారత చిత్ర పరిశ్రమలో కన్నడ దర్శకుడు (Prashanth Neel)ప్రశాంత్ నీల్ పేరు మోత మోగిపోతోంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే రూ.700 కోట్లు వసూలు చేసి రూ.1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది.
బాలీవుడ్ లో రూ.321 కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2 తర్వాత హిందీలో రెండో స్థానంలో నిలిచింది. యష్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'కేజీఎఫ్' ముందు వరకూ అంతగా ప్రచారం లేని కన్నడ చిత్రసీమను తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు.
ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ కర్ణాటకలో సెటిల్ అయి కన్నడలో సినిమాలు తీస్తున్నప్పటికీ, ఆయన మన తెలుగువాడే అని తెలుస్తోంది. ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే ప్రశాంత్ నీల్. ప్రస్తుత సత్యసాయి జిల్లా మడకశిరలోని నీలకంఠపురానికి చెందినవాడు. ఈ ఊరి పేరుమీదుగానే ఆయన పేరు చివరన నీల్ చేర్చుకున్నాడట. ఇటీవల కేజీఎఫ్ 2 విడుదల సందర్భంగా ప్రశాంత్ నీల్ స్వగ్రామానికి వచ్చి తండ్రి సమాధిని సందర్శించాడట. అయితే, ఆయన తండ్రి ప్రశాంత్ చిన్నతనంలోనే బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది. వీరు నివసించే ప్రాంతంలో సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుండడంతో (Prashanth Neel) కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ విషయాలు బయటికి రావడంతో తెలుగు అభిమానులు సంతోషిస్తున్నారు.
Follow Us