75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ చిత్రపురిలో అంగరంగవైభవంగా జరిగాయి. ఎందరో చలన చిత్ర ప్రముఖులు, తారలు జెండా వందనం చేసి, తమదైన శైలిలో దేశభక్తిని చాటుకున్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిలో స్ఫూర్తిని నింపే మాటలను మాట్లాడారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా భారత ప్రభుత్వం ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. చాలామంది సినీనటులు కూడా ఈ వేడుకలలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
కన్నడ సూపర్ స్టార్, కేజీఎఫ్ నటుడు యశ్ కూడా తన కుటుంబం సభ్యుల సమక్షంలో తన నివాసంలోనే జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో దేశభక్తిని పెంపొందించే పలు వాక్యాలను పోస్టు చేశారు. వాటిని తన అభిమానులతో పంచుకున్నారు.
"తిరంగ జెండా.. ఎంతో అసమానమైనది. దీనిని ఈ రోజు ఎగురవేయడం చాలా గర్వంగా ఉంది. ధైర్యానికి, పురోగతికి, నిజానికి ఇది నిలువెత్తు సంకేతం. నా తోటి భారతీయులందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ కేజీఎఫ్ స్టార్ యశ్ తన మదిలో మాటలను సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. తన అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తిరంగ జెండాకు సెల్యూల్ కొట్టి, తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ చిత్రాలను సోషల్ మీడియాలో తన అభిమానుల కొరకు పోస్టు చేశారు. చిరంజీవి గతంలో స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను 'సైరా' చిత్రంలో పోషించిన సంగతి తెలిసిందే.
Follow Us