మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్ర పోషించాడు. జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. మే 9న మేజర్ ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టింది.
శేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమాకి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్ షోలకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, బెంగళూరు, కొచ్చిన్, హైదరాబాద్ వంటి నగరాల్లో బుక్ మై షో ద్వారా ప్రివ్యూ షోస్ వేయబోతున్నారు. సోమవారం ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ దేశం కోసం చేసిన త్యాగాన్ని, సాహసాన్ని సినిమాలో చూపించారు.
మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఏడిపిస్తుండడంతో అడివి శేష్‌గా మార్చుకున్నాను అని చెప్పాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్ హీరో కాలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇండియన్స్ కమెడియన్ రోల్స్‌లోనే కనిపిస్తారని అన్నాడు అడివి శేష్ (Adivi Sesh).
Follow Us