మంచి క్యారెక్టర్ వస్తే రాజశేఖర్ (Rajasekhar) విలన్‌గా కూడా నటిస్తారంటున్న జీవిత

రాజశేఖర్ (Rajasekhar) ఫ్యామిలీ

టాలీవుడ్‌ సీనియర్ హీరో రాజశేఖర్‌ (Rajasekhar) ‌ హీరోగా నటించిన కొత్త సినిమా ‘శేఖర్’. జీవిత రాజశేఖర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శేఖర్ సినిమాలో రాజశేఖర్, జీవితల కూతురు శివాని రాజశేఖర్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకురాలు జీవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు.

'కొన్ని పరిస్థితుల కారణంగా డైరెక్షన్‌ చేయాల్సివచ్చింది. నాకు డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్‌ లేదు. తమిళ సూపర్‌ హిట్‌ సినిమా స్టోరీతో శేషు తీయాలని అనుకున్నాం. కానీ దానికి ఏ డైరెక్టర్‌ ఒప్పుకోలేదు. దాంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాను. మలయాళంలో హిట్‌ అయిన జోసెఫ్‌ సినిమాను తెలుగులో శేఖర్‌ పేరుతో తెరకెక్కించాం. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది.

మా ఫ్యామిలీకి ఎవరితోనూ గొడవల్లేవు. కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని తిప్పితిప్పి రాస్తూ యూట్యూబ్‌లో థంబ్‌ నయిల్స్‌ పెడుతూ మామధ్య దూరాన్ని పెంచుతున్నారు' అని జీవిత చెప్పారు.

'వారం రోజుల్లో శేఖర్‌‌ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని అనుకుంటుండగా రాజశేఖర్‌‌కు కరోనా సోకింది. చాలా సీరియస్ అయ్యింది. రాజశేఖర్‌‌ రికవర్ అయ్యాకా సినిమా షూటింగ్ స్టార్ట్‌ చేశాం. శేఖర్‌‌ సినిమాలో కూతురు క్యారెక్టర్‌‌కి స్క్రీన్‌ స్పేస్‌ చాలా తక్కువ. కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివానినే కూతురిగా చేయిస్తే బాగుంటుందని అనుకున్నాం.

రాజశేఖర్(Rajasekhar) నెగెటివ్ రోల్స్ చేస్తారా.. అని చాలామంది అడుగుతున్నారు. తన జర్నీ విలన్​గానే మొదలైంది. తర్వాత హీరోగా బిజీ అయ్యారు. రాంచరణ్ ‘ధ్రువ’ సినిమాలోని అరవిందస్వామి, పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి మంచి క్యారెక్టర్లు వస్తే తప్పకుండా చేస్తారు. చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా' అని జీవిత అన్నారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్‌ సినీ కార్ప్‌, సుధాకర్‌‌ ఇంపెక్స్‌ ఐపీఎల్,  త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై వంకాయలపాటి మురళీకృష్ణ శేఖర్‌‌ సినిమాను సమర్పిస్తున్నారు.

You May Also Like These