Regina Cassandra: క్యారెక్టర్ నచ్చితే దానికి న్యాయం చేయడానికి ఎంతైనా కష్టపడతా: రెజీనా కసాండ్రా

రెజీనా కసాండ్రా (Regina Cassandra)

హీరోయిన్‌ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తాజాగా నటించిన వెబ్‌ సిరీస్‌ అన్యాస్‌ ట్యుటోరియల్‌. ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా రెజీనా మీడియాతో మాట్లాడారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు రెజీనా.

చిన్నప్పుడే యాంకరింగ్..

స్కూల్‌లో చదివే రోజుల్లోనే యాంకరింగ్ చేసే దానిని. క్లాస్‌ లీడర్‌‌ను నేనే. ఆ సమయంలోనే అబ్బాయిలను కొట్టే దాన్ని. అందుకే చాలా మంది నేను డామినేట్‌ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పేవారు. తన ఫిజిక్ చూసి అందరూ అది నమ్మేసేవారు.

ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్పెషల్‌ సాంగ్‌లో డ్యాన్స్ చేయడం గర్వంగా ఉంది. ఈ వయసులో కూడా చిరంజీవి డ్యాన్స్‌ స్టెప్స్‌ను చాలా తొందరగా పట్టేశారు. అది చాలా గొప్ప విషయం. క్యారెక్టర్‌‌ నచ్చితే దానికి న్యాయం చేయడానికి ఎంత కష్టమైనా పడతాను.

ఆ సమయంలో భయపడ్డా..

2019లో కులుమనాలీలోని ఒక హోటల్‌లో ఐ మాస్క్‌ పెట్టుకుని నిద్రపోతున్నాను. ఆ సమయంలో ఎవరో నుదుటిపై తాకినట్టు అనిపించింది. వెంటనే మాస్క్ తీసేసి చూశాను. అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో చాలా భయం వేసింది. ‘కంద నాల్‌ ముదల్‌’ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రెజీనా. శివ మనసులో శ్రుతి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రొటీన్‌ లవ్‌ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. ప్రస్తుతం నేనే నా, శాకినీ ఢాకినీ సినిమాల్లో నటిస్తున్నారు రెజీనా (Regina Cassandra).

Read More : Anya’s Tutorial Review: థ్రిల్లింగ్‌గా రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్‌ ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్

You May Also Like These