Liger: టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'లైగర్' (Liger) సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. డైరెక్టర్ సుకుమార్‌తో జరిగిన ఇంటర్వ్యూలో 'లైగర్' విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'లైగర్' కథ ఎలా మొదలైందో.. మైక్ టైసన్‌తో యాక్టింగ్ చేయించాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలిపారు. హీరో అల్లు అర్జున్ కారణంగానే 'లైగర్' సినిమా మొదలుపెట్టానని పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
అల్లు అర్జున్‌తో మొదలైన కథ
'లైగర్' సినిమా ప్రమోషన్లలో భాగంగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ను ఇంటర్వ్యూ చేశారు డైరెక్టర్ సుకుమార్. ఈ సందర్భంగా, 'లైగర్' ఐడియా ఎలా వచ్చిందని సుకుమార్ పూరీ జగన్నాథ్‌ను అడిగారు.
తాను అల్లు అర్జున్ సినిమా 'ఇద్దరమ్మాయిలతో' డైరెక్ట్ చేస్తున్నప్పుడే, 'లైగర్' కథ పుట్టిందన్నారు పూరీ. అల్లు అర్జున్ ఓ హాలీవుడ్ దర్శకుడి గురించి 'పూరీ'తో పదే పదే చెప్పేవారట. హీరోకి ఏదో ఒక డిఫెక్ట్ ఉన్నా కూడా, ఆ హాలీవుడ్ దర్శకుడు కథనే నమ్ముకొని సినిమాని హిట్ చేసేవాడట. ఆయన ప్రేరణతోనే తాను 'లైగర్' చిత్రాన్ని తీశానని తెలిపారు పూరీ.
మైక్ టైసన్‌ను నటించేందుకు ఒప్పించాం : పూరీ
అల్లు అర్జున్ చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని 'లైగర్' సినిమా కథను పూరీ జగన్నాథ్ రాశారట. అయితే నత్తితో బాధపడే వ్యక్తిగా హీరో పాత్రను తీర్చిదిద్దాలని అనుకున్నారట.
తనకు ఎప్పటినుంచో 'లైగర్' సినిమా తెరకెక్కించాలని ఉందని.. అందులో తాను డిజైన్ చేసిన ఓ ప్రత్యేక పాత్రకు కచ్చితంగా మైక్ టైసన్ అయితేనే బాగుంటుందని అనుకున్నారట పూరీ. ఈ సినిమాలో పాత్ర కోసం మైక్ టైసన్‌ను ఒప్పించడానికి ఓ సంవత్సరం పట్టిందని పూరీ జగన్నాథ్ తెలిపారు.
Follow Us