ప్రియుడితో బంధాన్ని దాచాలని అనుకోవడం లేదంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ (Rakul Preeth Singh)

జాకీ భగ్నానీతో రకుల్‌ ప్రీత్‌ సింగ్

రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preeth Singh) తన ప్రియుడు జాకీ భగ్నానీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇటీవల ‘రన్‌ వే 34’తో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన ఆమె నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. కెరీర్‌ పరంగా తానెంతో సంతోషంగా ఉన్నానని చెప్పింది. ప్రియుడితో తన బంధాన్ని రహస్యంగా ఉంచాలని అనుకోవడం లేదని తెలిపింది. పోయినేడాది పుట్టినరోజు సందర్భంగా తన ప్రియుడు జాకీని పరిచయం చేసింది రకుల్‌. ఇద్దరూ టూర్‌లకు వెళ్లిన ఫోటోలు షేర్‌ చేసి వారి బంధం గురించి బయటికి చెప్పింది. అప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు ఒకటవుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా రకుల్ తన వ్యక్తిగత జీవితం గురించిన పలు విషయాలను వెల్లడించింది.

‘మన జీవితాల్లో తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఎలాగైతే ఉంటారో..  వ్యక్తిగత జీవితం కోసం కూడా మనకంటూ ఒక వ్యక్తి ఉంటాడు. నాకు జాకీ అటువంటి వ్యక్తే. మేమిద్దరూ మంచి స్నేహితులం. మా అభిరుచులు, విధానాలు కలిసాయి. దాంతో ప్రేమలో పడ్డాం. మేము రిలేషన్‌లో ఉన్నాం అని గమనించగానే ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. అందుకు కారణం లేకపోలేదు. మేం మా విషయాన్ని రహస్యంగా ఉంచితే మాపై రోజూ వార్తలు వస్తాయి. అసత్య ప్రచారాలతో మనసుకు ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం గురించి కన్నా మేం చేసే వర్క్‌ గురించి అందరూ మాట్లాడుకోవాలి. నేను సెలబ్రిటీని కావడంతో అందరూ మాపైనే దృష్టి పెడతారు. నేను న్యూస్‌ కాకూడదు అనుకునే రిలేషన్‌లో ఉన్న విషయాన్ని దాచుకోకుండా బయటకు చెప్పేశా’ అని రకుల్‌ చెప్పింది. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్ సింగ్ నాలుగు హిందీ, రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. ‘కొండపొలం’ సినిమా తర్వాత తెలుగులో మరో చిత్రానికి ఇప్పటి వరకు అంగీకారం తెలపలేదు రకుల్‌ (Rakul Preeth Singh). 

You May Also Like These