అతని జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు. సినీ రంగంలో ఎదిగే క్రమంలో అనుకోని ఇక్కట్లు. అయినా స్థిరంగా నిలబడ్డాడు. రాకెట్‌లా దూసుకుపోయాడు. చాలా చిన్న పాత్రతో సినిమా ప్రయాణం మొదలు పెట్టిన అజిత్ కుమార్ తన జీవితంలో అధిరోహించిన మైలురాళ్లు ఎన్నో. తన టాలెంట్‌తో తమిళ సినిమాల్లో హీరోగా వెండితెరపై మెరిసిన ఈ కథానాయకుడు.. ఫార్ములా వన్ ఛాంపియన్‌గానూ వినుతికెక్కాడు. అజిత్ కుమార్ బర్త్‌డే స్పెషల్ స్టోరి మీకోసం.
అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరో. మీకో విషయం తెలుసా..? ఆయన తన సినీ కెరీర్ మొదలుపెట్టింది కూడా తెలుగు సినిమాతోనే. ఆ సినిమా పేరు "ప్రేమ పుస్తకం". స్వర్గీయ గొల్లపూడి శ్రీనివాస్ ఈ సినిమా దర్శకుడు. ఆ తర్వాత అజిత్ పలు భాషలలో నటించారు. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దాదాపు 50 సినిమాల్లో హీరోగా చేశారు. అజిత్ నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో చాలా వరకు డబ్ చేశారు. డబ్బింగ్ సినిమాలైనా అజిత్ ఉంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేసేవాళ్లు . తెలుగు రాష్ట్రాలలో అజిత్‌కు అంతటి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన నటించిన "ప్రేమలేఖ" సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ మూవీ స్టేటస్‌ను అందుకోవడం విశేషం.
అజిత్ కుమార్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన యాక్టింగ్ ఫీల్డ్‌లోకి అనుకోకుండా ఎంటరై.. తర్వాత సూపర్ హీరో అయ్యాడు. దక్షిణాది చిత్రాలకు అందించే ప్రత్యేకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అజిత్ అందుకున్నారు. అలాగే సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు అజిత్‌ను మూడు సార్లు వరించింది.
రేసర్, పైలెట్ అజిత్..
అజిత్ అంటే యాక్టరనే అందరికీ తెలుసు. కానీ ఫార్ములా 2 రేసర్‌గా అజిత్ సాధించిన విజయాలు ఎవరికీ అంతగా తెలియదు. జాతీయ, అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో ప్రతీ సంవత్సరం అజిత్ పాల్గొంటారు. ఏరో మోడలింగ్ అంటే కూడా అజిత్‌కు ఆసక్తి ఉంది. అంతే కాదు.. పైలెట్ లైసెన్స్ కూడా అజిత్ కలిగి ఉన్నారు. షూటింగ్ లేని టైంలో స్టూడెంట్స్‌కు అజిత్ శిక్షణ కూడా ఇస్తుంటారు.
హాబీలు
పుస్తకాలు చదవడం అజిత్‌కు చాలా ఇష్టం. అలాగే ఫోటోలు తీయడం కూడా అజిత్ నుంచి నేర్చుకోవాల్సిందే. అంత బాగా ఫోటోలు తీస్తారు. ప్రేమలేఖ, ప్రియురాలు పిలిచింది లాంటి సినిమాల నుంచి.. ఈ మధ్యకాలంలో విడుదలైన విశ్వాసం, వివేకం లాంటి చిత్రాల వరకు.. అజిత్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అజిత్ విఘ్నేష్ శివన్‌తో కలిసి ఓ సినిమా తీస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి విలన్‌గా మూడోసారి అజిత్ సినిమాలో నటించనున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన కణ్మణి రాంబో ఖతిజా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Follow Us