టాలీవుడ్‌లో పూజా హెగ్డే (Pooja Hegde) అంటేనే ఓ క్రేజ్. ఈ మధ్య కాలంలో టాప్ హీరోలు సైతం పూజా హెగ్డేతో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు . అదీ పూజాకు ఉన్న డిమాండ్. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా ఐటం సాంగ్‌లతో కూడా పూజా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన.. ఆ తరువాత అంచెలంచెలుగా యాక్టింగ్ క్వీన్‌గా ఎదిగారు.
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోనూ తన నటనతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి.
బాల్యం
పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13 తేదీన జన్మించారు. పూజా తండ్రి మంజునాథ్ ఓ క్రిమినల్ లాయర్. ఆయన అడ్వర్టైజ్‌మెంట్ రంగంలోనూ పనిచేసేవారట. పూజా తల్లి పేరు లత. ఇక పూజా హెగ్డే అన్నయ్య రిషభ్ వైద్య వృత్తిలో ఉన్నారు. మన "బుట్టబొమ్మ" పుట్టింది పెరిగింది మహారాష్ట్రలోని ముంబైలో.. కానీ వీరి పూర్వీకుల స్వస్థలం మాత్రం కర్నాటకలోని ఉడిపీ ప్రాంతం. పూజా మాతృభాష తుళు.
మెడల్‌గా
పూజా హెగ్డే (Pooja Hegde)ముంబైలోని ఎం.ఎం.కే కాలేజీలో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో పూజా ఎన్నో డాన్స్ షోలు, ఫ్యాషన్ షోలలో పాల్గొనేవారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2009 మిస్ ఇండియా పోటీల్లో కూడా పూజా పాల్గొన్నారు. "మిస్ ఇండియా టాలెంటెడ్ 2009" టైటిల్ గెలుపొందారు. ఆ తర్వాత, 2010లో "మిస్ యూనివర్స్ ఇండియా" పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. అదే సంవత్సరం "మిస్ ఇండియా సౌత్ గ్లామరస్ హెయిర్" కిరీటాన్ని పూజా హెగ్డే సొంతం చేసుకున్నారు.
సినిమా ఎంట్రీ
మోడలింగ్ అవకాశాలతో పాటు పూజా హెగ్డేకు సినిమా అవకాశాలు కూడా వెనువెంటనే వచ్చాయి. పూజా హెగ్డే మొదట ‘ముగామూడీ’(తెలుగులో ‘మాస్క్’) అనే తమిళ చిత్రంలో నటించారు. మొదటి సినిమాతోనే ఆమె "సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు"లకు నామినేషన్ పొందారు. ఉత్తమ తొలి చిత్ర నటిగా నామినేట్ అయ్యారు. ఆ తరువాత నాగచైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో పూజా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
వరుణ్‌తేజ్‌కు జోడిగా "ముకుంద" సినిమాలోనూ పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాలో "గోపికమ్మ" పాటతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు పూజ. ఆ తర్వాత "మొహెంజో దారో" సినిమాతో మన బుట్టబొమ్మ బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. ఈ సినిమాలో ఆమె హృతిక్ రోషన్ సరసన నటించారు. అయితే ఈ "మొహెంజో దారో" చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే పూజాకు తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం నుంచి ఆఫర్ వచ్చిందట. అయితే బాలీవుడ్ సినిమా బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ ఇవ్వలేదట పూజ.
"మొహెంజో దారో" ఫ్లాప్ తరువాత పూజా హెగ్డే నటించిన అల్లు అర్జున్ సినిమా "దువ్వాడ జగన్నాథం" ఆమెకు భారీ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత పూజా "రంగస్థలం"లో జిగేల్ రాణిగా ఓ ఐటం సాంగ్‌లో నటించి మరింత పాపులర్ అవ్వడం విశేషం. "జిగేల్ రాణి" పాట అప్పట్లో యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత పూజకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సాక్ష్యం, జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత సినిమాలలో ఆమె హీరోయిన్‌గా నటించారు.
మరింత పాపులర్
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే "మహర్షి" సినిమాలో నటించారు. అలాగే వరుణ్ తేజ్ సరసన "గద్దలకొండ గణేష్"లో ఓ ప్రత్యేక పాత్రలో యాక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ సినిమా "హౌస్‌ఫుల్ 4"లోనూ పూజా నటించారు. ఈ సినిమాలతో పూజా హెగ్డే పాపులర్ అయినప్పటికీ.. అల్లు అర్జున్‌తో నటించిన "అలా వైకుంఠపురంలో" సినిమాతో పూజా పేరు బుట్టబొమ్మగా స్థిరపడిపోయింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన "బుట్టబొమ్మ" పాట ఓ రేంజ్‌లో హిట్ అయిన సంగతి తెలిసిందే.
2021లో విడుదలైన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో అఖిల్‌తో జోడి కట్టారు పూజా. ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా పూజా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తమిళ నటుడు విజయ్‌తో నటించిన "బీస్ట్" సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. కానీ విజయ్‌తో జత కట్టి ఈమె చేసిన "అరబిక్ కుత్తు" సాంగ్ మ్యూజిక్ వరల్డ్‌ను షేక్ చేసింది. ఈ సినిమా తరువాత రిలీజ్ అయిన చిరంజీవి "ఆచార్య", ప్రభాస్ "రాధేశ్యామ్" చిత్రాలు పూజను నిరాశ పరిచాయి.
అయినా సినిమా హిట్టా లేక ఫట్టా అనే విషయాలతో సంబంధం లేకుండా, పూజా హెగ్డేకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రపంచ సినిమా వేడుకలైన "కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్"కు భారత ప్రతినిధిగా పూజా హగ్డే హాజరయ్యారు. ఆ వేడుకలో పూజా హెగ్డే తన కాస్ట్యూమ్స్ బ్యాగ్ మిస్ అయినా కూడా, ఏమీ ఇబ్బంది పడలేదట. అప్పటికప్పుడు సొంత ఐడియాతో తన లుక్ ఏ మాత్రం తగ్గకుండా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలే విడుదలైన "ఎఫ్3"లో సైతం ఓ ఐటం సాంగ్‌తో పూజా అదరగొట్టారు.
పూజా నెక్ట్స్ ప్రాజెక్ట్స్
పూజా హెగ్డే ఓ రెండు హిందీ సినిమాలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌తో పాటు, రణ్‌వీర్ సింగ్ సరసన కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మహేష్ బాబుతో కలిసి "ఎస్ఎస్ఎంబి 28"లో యాక్ట్ చేస్తున్నారు.
Read More: Pooja Hegde: బ్యాగులు మిస్.. కానీ రెడ్ కార్పెట్ వాక్ కోసం పూజ హెగ్డే ఇచ్చిన ఐడియా అదుర్స్!
Follow Us