మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్రేజ్‌ను మరోసారి నిరూపించిన ‘గాడ్‌ఫాదర్’(GodFather).. మళ్లీ పెరిగిన వసూళ్లు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) సినిమా దసరా కానుకగా విడుదలైంది. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆచార్య సినిమా రిజల్ట్‌తో కొద్దిగా నిరాశ చెందిన చిరంజీవి.. గాడ్‌ఫాదర్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. విడుదలైన అన్ని కేంద్రాలలో సక్సెస్‌ఫుల్ టాక్‌ను సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌‌ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కింది. అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ సినిమా.. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఆచార్య సినిమాకు వచ్చిన టాక్ కారణంగా మొదటిరోజు వసూళ్లు కొంచెం తగ్గాయి. ఆ తర్వాత రోజు నుంచి క్రమంగా పెరిగిన కలెక్షన్స్‌ వీకెండ్‌లో మరోసారి తగ్గాయి.

తగ్గి.. పెరిగాయి..

కాగా, ఈ శనివారం వసూళ్లు మరోసారి పెరిగాయని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన గాడ్‌ఫాదర్ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించారు. సినిమాకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన గాడ్‌ఫాదర్‌‌ సినిమా ఇప్పటివరకు ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో ఒక లుక్ వేద్దాం.

నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో దాదాపుగా రూ. 35 కోట్ల బిజినెస్ జరిగింది.  తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల బిజినెస్ జరుగగా.. కర్నాటకలో రూ. 6.50 కోట్లు, హిందీతో కలిపి దేశవ్యాప్తంగా రూ.6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ జరిగింది.

11వ రోజు..

'గాడ్‌ఫాదర్' సినిమాకు 11వ రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి.  నైజాం, సీడెడ్‌లో చెరో రూ.9 లక్షల, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, తూర్పు గోదావరి, కృష్ణాలో చెరో రూ. 7 లక్షలు, పశ్చిమ గోదావరి, గుంటూరులో చెరో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 56 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. కాగా, 11 రోజుల్లో  నైజాంలో రూ. 11.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.26 కోట్లు, గుంటూరులో రూ. 3.88 కోట్లు, కృష్ణాలో రూ. 2.68 కోట్లు, నెల్లూరులో రూ. 1.99 కోట్లతో  రూ. 41.36 కోట్లు షేర్, రూ. 68 కోట్ల గ్రాస్ వసూలైంది.

వరల్డ్‌వైడ్‌గా..

ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 41.36 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్​ఫాదర్' సినిమా వసూళ్లపరంగా వరల్డ్‌వైడ్‌గా కూడా సత్తాచాటింది. కర్నాటకలో రూ. 4.60 కోట్లు, హిందీతోపాటు దేశవ్యాప్తంగా రూ. 4.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.05 కోట్లు వసూలు చేసింది. గాడ్‌ఫాదర్ (God Father) సినిమా కలెక్షన్లు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్రేజ్‌ను మరోసారి నిరూపించిందని ఇండస్ట్రీ టాక్.

Read More : ‘పెర్ఫామెన్స్‌కు పవర్‌‌హౌస్‌’ చిరంజీవి (Chiranjeevi).. గాడ్‌ఫాదర్ సక్సెస్‌పై నయనతార (Nayanthara) ట్వీట్

You May Also Like These