మొత్తానికి కేజీఎఫ్‌2 సినిమా చూశాను.. అదో గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న డైరెక్టర్ శంకర్ (Shankar)

కేజీఎఫ్‌2 సినిమాపై శంకర్‌‌ కామెంట్లు

డైరెక్టర్ శంకర్‌‌ (Shankar)కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి డైరెక్టర్‌‌ కేజీఎఫ్‌ పార్ట్‌ 2 ఇన్నాళ్లూ చూడలేదు. ఇటీవల కేజీఎఫ్‌2 సినిమా చూసిన శంకర్ దానిపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశాడు.

కేజీఎఫ్‌2 సినిమా ఒక అద్భుతం అని మెచ్చుకున్నాడు శంకర్. స్టోరీ టెల్లింగ్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అన్నీ చాలా బాగున్నాయని అన్నాడు. కేజీఎఫ్‌2 ఒక అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ అని అన్నాడు శంకర్.  “Finally saw #KGF2 Cutting edge style Storytelling, Screenplay & Editing. Bold move to intercut action & dialogue, worked beautifully. Revamped Style of Mass 4 the powerhouse @TheNameIsYash Thanks Dir @prashanth_neel 4 giving us a “periyappa” experience. @anbariv Terrific to the Team (sic),” అని శంకర్‌‌ తెలిపాడు.

ఇక, బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది యశ్‌ హీరోగా వచ్చిన ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’. యశ్‌(Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇప్పటివరకు రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలోకి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘కేజీయఫ్‌2’ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.  ఈ సినిమా ఇప్పటికిప్పుడే చూడాలంటే మాత్రం ఎర్లీ యాక్సెస్‌ కోసం అదనంగా రూ.199 చెల్లించాలి.  దీంతో ఓటీటీలో ‘కేజీయఫ్‌2’ వచ్చేసిందని ఆనందపడిన వాళ్లు షాకవుతున్నారు. 

 ‘కేజీయఫ్‌2’ చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. ‘కేజీయఫ్‌2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా పూర్తిగా చూసేయాలి. మే 20వ తేదీన  జీ5 వేదికగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా T-VOD ప్రకారమే అందుబాటులో  తీసుకురానున్నట్టు జీ5 తెలిపింది.

ఇక,  హోంబ‌లే ఫిలిమ్స్, విజ‌య్ కిర‌గాంధూర్ క‌లిసి కేజీఎఫ్‌2 సినిమా నిర్మించారు. త‌మిళ్ న్యూ ఇయ‌ర్ రోజు అంటే ఏప్రిల్ 14 సినిమా రిలీజ్ చేశారు. 10,000 ధియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా కేజీఎఫ్2ను రిలీజ్ చేశారు. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్, తెలుగు, మ‌ళ‌యాళంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే రూ.546 కోట్లు వ‌చ్చేశాయి. ఇక రెండో వారంలో వేయి కోట్ల రూపాయ‌ల‌ను సొంతం చేసుకుంది కేజీఎఫ్‌2. ఇన్ని రోజులకు కేజీఎఫ్‌2 సినిమా చూసి కామెంట్లు చేశాడు శంకర్ (Shankar)

You May Also Like These