దేశంలో హాట్ టాపిక్‌గా మారిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. హడావుడి లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో తెగ ఆడేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది.
ఓటీటీ రైట్స్ ఎవరికి?
జీ5 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా స్టోరీ..
కశ్మీర్ పండిట్లపై 30 ఏళ్ల క్రితం దాడులు జరిగాయి. పాకిస్తాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణ కాండ జరిపారు. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు. అంతేకాకుండా క్రూరంగా చిత్రహింసలు పెట్టారు.కశ్మీర్ పండిట్లపై జరిగిన హింసపై ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రీ తెరకెక్కించారు.
ఎవరు నటించారు?
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోష్,దర్శన్ కుమార్, చిన్మయ్ మండ్లేకర్, ప్రకాశ్ బెల్వాడీలు ఈ సినిమాలో నటించారు.
సినిమా విశేషాలు
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయించారు. అస్సాం ప్రభుత్వం సినిమా చూసేందుకు సెలవు కూడా ప్రకటించింది. ఈ చిత్ర బడ్జెట్ 18 కోట్ల రూపాయలైతే... విడుదలైన ఐదు రోజుల్లో దాదాపు 70 కోట్లు కొల్లగొట్టింది.
Follow Us