మహానటి సినిమాలో సావిత్రి క్యారెక్టర్‌లో జీవించి ప్రేక్షకుల నీరాజనాలతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు కీర్తి సురేష్ (Keerthy Suresh). ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి. స్కిన్ షోకి దూరంగా ఉంటూనే తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
‘మహానటి’ సినిమా హిట్ కావడంతో కీర్తి సురేష్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించారు కీర్తి. అదే సమయంలో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవల తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాతోపాటు తమిళ సినిమా ‘సాని కాదియం’ సినిమాల్లో కీర్తి నటించారు. ఈ రెండు సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.
ఇంట్లోనే 7 నెలలు..
ఈ క్రమంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) మీడియాతో మాట్లాడారు. కెరీర్‌తోపాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. విజయ్ సేతుపతి నటనంటే తనకెంతో ఇష్టమని చెప్పారు కీర్తి. అంతేకాకుండా కార్తీ, జయం రవి వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పారు కీర్తి.
మహానటి సూపర్ హిట్ సాధించిన తర్వాత దాదాపుగా ఏడు నెలలు ఇంట్లోనే గడిపానని కీర్తి చెప్పారు. ఈ సమయాన్ని తన ఫిట్‌నెస్ కోసం ఉపయోగించుకున్నానని తెలిపారు. ఎక్స్‌ర్‌సైజులు చేశానని, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని బరువు తగ్గానని అన్నారు.
ఒకే రెమ్యునరేషన్..
తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న కీర్తి సురేష్.. రెండు భాషల్లోనూ ఒకేలా రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కలిపి మూడు భాషల్లో నటిస్తున్నారు కీర్తి సురేష్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఫాహద ఫాజిల్, వడివేలు నటిస్తున్న ‘మామన్నన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు.
ఇక, తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘దసరా’ సినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలోనూ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు.
Read More : సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ మల్టీస్టారర్‌లో నటించనున్న నేచురల్ స్టార్ నాని (Nani)! నిజమెంత?
Follow Us