బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా ఇమేజ్‌ను అమాంతం పెంచేశారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. కరోనా కారణంగా అతలాకుతలమైన సినిమా ఇండస్ట్రీకి తన సినిమాతో పూర్వ వైభవం తెచ్చారు రాజమౌళి. థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు వెనుకాడుతున్న సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను విడుదల చేసి రూ.1,200 కోట్లు వసూలు చేశారు.
బాహుబలి సినిమాలు అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేసినప్పటికీ.. కరోనా తర్వాత పరిస్థితులు గమనిస్తే ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం సాధారణమైన విషయం కాదు. అంతేకాదు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఆస్కార్ బరిలో నిలబెట్టడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రెగ్యులర్‌గా అమెరికా వెళుతూ అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జక్కన్న.
క్లారిటీ ఇవ్వలేకపోతున్న జక్కన్న..
ఇటీవల అమెరికా చికాగోలోని ఫిలిం క్రిటిక్‌కు రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచన ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై తన తండ్రి విజయేంద్రప్రసాద్‌తో చర్చించానని, కథ ఎప్పటికి రెడీ చేస్తారో తెలియదని అన్నారని టాక్. ‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలాసార్లు రాజమౌళి చెప్పారు కూడా. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కిస్తాడనే విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
బాహుబలి3 కూడా తెరకెక్కించే ఆలోచన కూడా ఉందని ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి. వీటితో కలిపి దర్శకధీరుడు చెయ్యాలని అనుకుంటున్న ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం రాజమౌళి.. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఒక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నారు రాజమౌళి (SS Rajamouli).
Read More : RRR : "ఆర్ఆర్ఆర్" కొత్త రికార్డు - జపాన్ దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన రాజమౌళి సినిమా
Follow Us