హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పప్పు స్టూడియోను ప్రారంభించారు. ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), హీరో నితిన్ (Nithiin) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ, ప్రకాశ్ రాజ్, దిల్ రాజు, హాజరయ్యారు. పప్పు సొంత డబ్బింగ్ థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. పప్పు వండర్ ఫుల్ టెక్నీషియన్ అన్నారు.
25 ఏళ్లుగా పప్పు తనకు తెలుసని.. అతను ప్రతీ ఆర్టిస్టుతో కలిసిపోతారని చిరంజీవి (Chiranjeevi) చెప్పారు. ఇకపై తన సినిమాలకు పప్పు స్టూడియోలోనే డబ్బింగ్ చేయిస్తామని చిరంజీవి తెలిపారు. తనతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలోని 80 శాతం మంది ఆర్టిస్టులకు పప్పు పనితనం తెలుసన్నారు.
హీరో నితిన్ (Nithiin) కూడా పప్పు స్టూడియో ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా 'మాచర్ల నియోజకవర్గం' డబ్బింగ్ వర్షన్ కూడా స్టాట్ చేశారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది.
Follow Us