మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన చిత్రం ఆచార్య (Acharya). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి (MegaStar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రమోషన్లు కూడా ప్రారంభించి ఈరోజే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఈ చిత్రం 2 గంటల 34 నిమిషాల ప్లే టైమ్‌తో విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి (MegaStar Chiranjeevi) సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే ఆడిపాడింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం, పాటలు ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ పాత్రల పరిచయం సూపర్‌స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో జరుగుతుందని తెలియడంతో చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల సురేఖ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య(Acharya).
కాగా, శనివారం హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఆచార్య (Acharya) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే ఈవెంట్‌కు పవన్ రావట్టేదని తెలిసింది. ఇక, ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా చేసిన కాజల్ అగర్వాల్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకావడం లేదు. ఇటీవలే కాజల్‌కు డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు కాజల్ జన్మనిచ్చింది.
ఈవెంట్‌కు హాజరయ్యే వాళ్లకు పాస్‌లు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను మాత్రమే ఈవెంట్‌కు రావాలని చెబుతున్నారు. పాస్ లేని వాళ్లను ఈవెంట్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
Follow Us