VirataParvam​​ : చ‌లో.. చ‌లో .. అంటూ విరాట‌ప‌ర్వంలో విప్ల‌వ గీతం పాడిన రానా !

VirataParvam​​ : విరాట‌ప‌ర్వం సినిమా నుంచి చ‌లో.. చ‌లో .. అంటూ సాగిన ఓ విప్ల‌వ గీతాన్ని రిలీజ్ చేశారు. రానా కూడా ఈ పాట‌లో గొంతు క‌లిపారు. 

విరాటపర్వం (Virata Parvam).. ఇదో పీరియడ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్‌లో ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు వేణు ఊడుగుల స్వయంగా ఈ సినిమాకు కథను కూడా అందించారు.

1990 లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

VirataParvam​​ : 'విరాట‌ప‌ర్వం' సినిమా నుంచి మేకర్స్ ఈ రోజే ఓ విప్ల‌వ గీతాన్ని రిలీజ్ చేశారు. రానా దగ్గుబాటి, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టించిన 'విరాట‌ప‌ర్వం' సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.

అలాగే తాజాగా ఇదే  'విరాట ప‌ర్వం' సినిమా నుంచి ట్రైల‌ర్ కూడా  రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైల‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదే క్రమంలో చ‌లో.. చ‌లో .. అంటూ సాగిన ఓ విప్ల‌వ గీతాన్ని  ఈ రోజే రిలీజ్ చేశారు. రానా కూడా ఈ పాట‌కి తన గళాన్ని క‌లిపారు. 

 

ప్రమోషన్లతో రానా ద‌గ్గుబాటి బిజీ 

'విరాట ప‌ర్వం' షూటింగ్ ఎప్పుడో పూర్త‌యినా.. క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయ‌నున్నారు. రానా, సాయిప‌ల్ల‌వి ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నారు. తెలంగాణ‌లో జ‌రిగిన న‌క్స‌లైట్ ఉద్య‌మ నేప‌థ్యంలో విరాట‌ప‌ర్వం చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. 

విరాట‌ప‌ర్వం ప్రీమియ‌ర్ షోల‌కు మంచి టాక్
విరాటపర్వం (Virata Parvam) సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోల‌ను వేశారు. ఈ చిత్రం చూసిన సినీ ప్ర‌ముఖులు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తుంద‌ని చెప్పారు. రానా, సాయిప‌ల్ల‌వి నటించిన యాక్ష‌న్ సీన్స్ సూప‌ర్ అంటున్నారు. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. మరి మనం కూడా 'విరాట‌ప‌ర్వం' చిత్రం థియేట‌ర్ల‌లో ఎలాంటి హిట్ సాదిస్తుందో చూడాలి.  

Read More: విరాట పర్వంలో ఒక సీన్‌ కోసం సాయిపల్లవి (Sai Pallavi) రోజంతా ఏమీ తినలేదు.. డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా !

You May Also Like These