Pooja Hegde: టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే ప్రపంచ సినిమా వేడుకల్లో బిజీగా ఉన్నారు. అందం, అభినయంతో అందరినీ ఆకర్షిస్తున్నారు. భారతీయ ప్రతినిధురాలిగా పూజ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అక్కడ పూజ కాస్ట్యూమ్స్ గురించి చాలా పెద్ద చర్చే నడుస్తుంది. కానీ పూజ హెగ్డే మాత్రం తన డెస్సులు, నగలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.కేన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes 2022) లో రెడ్ కార్పేట్‌పై పూజ హెగ్డే సందడి చేస్తున్నారు. అదిరిపోయే మేకప్, కాస్ట్యూమ్‌లతో చెలరేగిపోతున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో రెడ్ కార్పెట్‌పై ఇచ్చిన ఫోజులతో.. మతి పోగొట్టే ఫోటోలను పెడుతున్నారు.
మొదటి సారి అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు వెళ్లిన పూజ హెగ్డే ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అది విన్న వారు షాక్ అయ్యారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కోసం పూజ హెగ్డే ఎన్నో రకాల డ్రెస్సులు డిజైన్ చేయించుకున్నారట. ధగధగ లాడే జ్యూవెలరీ కూడా సిద్ధం చేసుకున్నారట. కానీ వేడుకలకు సిద్ధం చేసిన బ్యాగులు ఫ్రాన్స్‌కు వెళ్లలేదట.
పూజ హెగ్డే కాస్ట్యూమ్ బ్యాగులు ఇండియాలోని ఓ ఎయిర్ పోర్టులో మిస్ అయ్యాయట. తన టీంలో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్ రావడంతో బ్యాగులు మిస్ అయ్యాయని ఆమె తెలిపారు. ఫ్రాన్స్ వెళ్లాక మిగతా బ్యాగులు రాలేదని తెలియడంతో అందరూ టెన్షన్ ఫీలయ్యారట.
పూజ హెగ్డే కోసం డిజైన్ చేసిన డ్రెస్సులు, మేకప్ కిట్, నగలు లేకపోవడంతో వాళ్ల టీం అప్ సెట్ అయ్యారు. అనుకున్నది ఒక్కటి.. అయ్యిందొకటి అన్నట్లుగా వారి పరిస్థితి మారింది. ఎన్నో రోజుల నుంచి తనను అందంగా చూపించాలని ఎంతో కష్టపడి డిజైన్ చేసిన డ్రెస్సులు రాకపోయే సరికి అందరూ బ్యాడ్ లక్ అనుకున్నారు.
అయితే పూజ హెగ్డే తెలివిగా ఆలోచించి తన టీం టెన్ష్‌న్ పోగొట్టారు. రెడ్ కార్పెట్‌పై వాక్ చేయాలనే తన కలను పూజ నిజం చేసుకున్నారు. తన మేనేజరుతో పాటు టీంతో మాట్లాడి అప్పటికప్పుడు డిజైనర్ డ్రెస్సులు, బ్యూటీ ప్రొడక్డ్స్ తెప్పించారు.
రెడ్ కార్పెట్‌పై పూజ హెగ్డే అప్పటికప్పుడు తెచ్చిన డిజైనర్ కాస్ట్యూమ్స్ ధరించి క్వీన్‌లా మెరిసిపోయారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెడ్ కార్పెట్ వాక్ వరకు ఎవరూ లంచ్ కూడా చేయలేదు. పూజ హెగ్డే డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యాకనే అందరూ కలిసి రాత్రి డిన్నర్ చేశారట.
Pooja Hegde: ఇన్ స్టా రీల్స్‌లో పూజ హెగ్డే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ విషయాలను షేర్ చేసుకున్నారు. తన కాస్ట్యూమ్స్ గురించి వివరాలను కూడా తెలిపారు. రెడ్ కార్పెట్‌పై వాక్ చేయడం తనకు ఓ అద్భుతమైన రోజుగా మిగిలిపోయిందంటూ పూజ ఆనందం వ్యక్తం చేశారు.
Follow Us