రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15 సినిమా అప్ డేట్స్ క్రేజీగా అనిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ఆర్సీ 15 తెరకెక్కనుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ చరణ్ ఈ సినిమాలో సీఎం పాత్రలో నటిస్తున్నారని టాక్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
అప్పుడు భార్య.. ఇప్పుడు తల్లి
రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ఆర్సీ 15లో హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తున్నారు. రామ్‌కు జోడిగా కియారా ఓ డిఫరెంట్ రోల్‌ని పోషించబోతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో డబుల్ రోల్ పోషిస్తున్నారని టాక్.
ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్‌గా ఆయన కనిపిస్తారని వార్తలొచ్చాయి. బాలీవుడ్ లెజండరీ హీరో రిషి కపూర్ భార్య నీతూ కపూర్ కూడా రామ్ చరణ్ సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారట.
బహుశా, రామ్ చరణ్ తల్లి పాత్రలో నీతూ కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దర్శకుడు శంకర్ అలనాటి మేటి నటి నీతూ కపూర్‌ను తల్లి పాత్ర చేసేందుకు ఒప్పించారట. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ఇంకా ఈ విషయాలన్ని వెల్లడించలేదు.
రిషి కపూర్, నీతూ కపూర్ల కుమారుడు రణబీర్ కపూర్ కూడా బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆర్.ఆర్.ఆర్. సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా రణబీర్ కపూర్ సతీమణి అలియా భట్ నటించారు. ఇప్పుడు రణబీర్ తల్లి నీతూ కపూర్ కూడా చరణ్ చిత్రంలో నటించనున్నారు. ఏదేమైనా, బాలీవుడ్ స్టార్లు ప్రస్తుతం టాలీవుడ్‌కు క్యూ కడుతున్నారనేది వాస్తవం.
బాలీవుడ్‌లోకి రామ్ చరణ్
ఇక రామ్ చరణ్ (Ram Charan) కూడా బాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా 'కభీ ఈద్ కభీ దివాళీ'లో రామ్ చరణ్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారట.
మరో విషయం ఏంటంటే 'విక్రమ్ 2' లో కూడా రామ్ పాత్ర కీలకంగా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నారు.
Follow Us