అంటే సుందరానికి.. ప్రస్తుతం అందరి కళ్లూ ఇదే సినిమా మీద ఉన్నాయి నాని ఈ సినిమాలో సుందర్ ప్రసాద్ అనే పాత్రను పోషిస్తున్నాడు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందరానికి గండాలు ఎక్కువ. ఆ గండాల నుండి తప్పించుకోవడానికి ఆయన కుటుంబం అంతా హోమాల బాట పడుతుంది. అదే సమయంలో సుందరం జీవితంలోకి లీలా (నజ్రియా) వస్తుంది. ఆమె క్రైస్తవురాలు. వీరు ప్రేమలో పడి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కానీ ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి వ్యతిరేకిస్తాయి.
ఇలాంటి సమయంలో ఈ జంట ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడతారు. ఆ ప్లాన్ ఏమిటి? అందులో నుండి జనరేట్ అయ్యే కామెడీ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. చాలా విజువల్ అప్పీలింగ్గా ఉంది. అలాగే వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కామెడీ డైలాగ్లతో, పంచ్లతో ఈ టీజర్ వెరైటీగా ఉంది. జూన్ 10 తేదిన ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సినిమా టీజర్లోని కొన్ని ఝలక్ డైలాగులున్నాయి. అవి మీకోసం
మేనేజర్ (హర్షవర్థన్) : దెబ్బ తగిలే డ్రెస్ వేసుకున్నావా.. లేక డ్రెస్ వేసుకున్నాకే దెబ్బ తగిలిందా?
నాని : మా ఇంట్లో ఆచారం ప్రకారం.. ఎవరైనా సముద్రం దాటొస్తే, రెండు రోజులు ఇలాంటి డ్రెస్సులే వేసుకొని తిరుగుతారు. ఇక చాలా సార్.
జ్యోతిష్యుడు - మీవాడి జాతకం అసలు బాలేదండి. చూడండి.. వైకుంఠపాళిలో పాముల్లా ఉన్నాయి గండాలు ఒకదాని తర్వాత ఒకటి.
తండ్రి (నరేష్), తన కొడుకుతో - ఒరేయ్.. నీకు ద్విచక్ర వాహనం గండం ఉందట.
Follow Us