చాలా కాలం నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ (Allari Naresh).. నాంది సినిమాతో ఫామ్‌లోకి వచ్చాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ చేస్తున్నాడు నరేష్. ఇక, నాంది సినిమాలో మొదటిసారి పూర్తి సీరియస్ పాత్రను పోషించాడు. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అయ్యింది. దీంతో మరోసారి సీరియస్ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు.
అల్లరి నరేష్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్లరి నరేష్ నటిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జీ స్టూడియోస్, హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రాజమోహన్ దర్శకత్వం చేస్తున్నాడు. నరేష్ 59వ చిత్రంగా వస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది.
అల్లరి సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి అదే తన ఇంటి పేరుగా సెటిల్ అయిన హీరో అల్లరి నరేష్. దివంగత స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నరేష్.. మొదట్లో కామెడీ నేపథ్యం ఉన్న సినిమాల్లోనే నటించినా..క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడిగా ఎదిగాడు. ఆ క్రమంలో చేసిన సినిమానే ‘నాంది’. ఏ తప్పూ చేయకుండానే శిక్ష అనుభవించిన వ్యక్తి పాత్రలో నరేష్ నటన అందరికీ తెగ నచ్చేసింది.
నాంది సినిమాలో నటనకుగాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా మణికందన్‌కు అవార్డు వచ్చింది. ఇక అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన నాంది సినిమాకు దర్శకత్వం వహించిన కొత్త డైరెక్టర్ కనకమేడల విజయ్‌కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు దక్కింది.
Follow Us