షుగర్‌‌ కంటెంట్‌ ఉన్న డ్రింక్‌ను ప్రమోట్‌ చేస్తున్న అలియా భట్ (Alia Bhatt).. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

ఇటీవల జరిగిన ఒక సినిమా ఫంక్షన్‌లో అలియా భట్ (Alia Bhatt)

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, గంగూబాయ్ కథియావాడి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది అలియా భట్ (Alia Bhatt). తన అందం, అభినయంతో పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం అలియా చేసిన పని నెట్టింట వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆమె చేసిన పనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. డబ్బు కోసం ఎంత పనైనా చేస్తావా అని అలియాపై మండిపడుతున్నారు.

ఇంతకీ అలియా చేసిన పనేంటంటే.. షుగర్ కంటెంట్‌ ఉన్న డ్రింక్‌ను ప్రమోట్ చెయ్యడమే. చాలా మంది సినిమా తారలు.. ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని ప్రమోట్‌ చేయబోమని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే చేసుకున్న అగ్రిమెంట్లను కూడా కేన్సిల్ చేసుకున్నారు కూడా. అయితే..ఈ బ్రిటన్‌ బ్యూటీ మాత్రం షుగర్ కంటెంట్‌ ఉన్న డ్రింక్‌ తాను తాగబోనని, అది ఆరోగ్యానికి హానికరం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అలియా.. ఇప్పుడు దానిని తాగాలని ప్రమోట్‌ చేసే యాడ్‌లో నటించింది.

గతంలో ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదిత్యారాయ్ కపూర్, వరుణ్‌ ధావన్‌లతో కలిసి కపిల్‌ శర్మ కామెడీ షోకి వెళ్లింది ఈ బ్యూటీ. ఆ ప్రోగ్రామ్‌లో అలియాకు షుగర్‌‌ డ్రింక్‌ను షో హోస్ట్‌ ఆఫర్ చేశాడు. దానిని తీసుకోవడానికి అలియా తిరస్కరించింది. తాను షుగర్ డ్రింక్స్‌ తాగబోనని.. అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పింది.

ఇక తాజాగా అలియాభట్‌ ఒక షుగర్ కంటెంట్‌ ఉన్న డ్రింక్‌ను ప్రమోట్‌ చేస్తూ వీడియో చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అలియా షుగర్ డ్రింక్స్‌ తాగదు. కానీ డబ్బుల కోసం షుగర్‌‌ కంటెంట్‌ ఉన్న బ్రాండ్స్‌ను మాత్రం ప్రమోట్ చేస్తుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల తన ప్రియుడు బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌‌ కపూర్‌‌ను అలియా పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతోపాటు డార్లింగ్స్, రాకీ ఔర్‌‌ రానీ కీ ప్రేమ్‌ కహానీ సినిమా షూటింగ్‌ల్లో  బిజీబిజీగా ఉంది అలియా భట్ (Alia Bhatt)

You May Also Like These