Akhanda-Acharya:బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరు హీరోలు సేమ్ స్టోరీలు ఉన్న చేశారా? అఖండ, ఆచార్య సినిమా స్టోరీలో తేడాలేంది?. కామన్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా హిట్‌గా నిలిచింది. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ వేవ్‌లో కొనసాగింది. బాలకృష్ణ అఖండ సినిమాలో డబుల్ రోల్ చేశారు. అఖండ సినిమా స్టోరీ, పాటలు, డైలాగులు ప్రేక్షకులను మెప్పించాయి. బాలకృష్ణ అఖండ సినిమాలో అఘోరాలా కనిపించారు. అఖండ బాలకృష్ణ కేరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గ నిలిచింది.
చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అయింది. రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి నటించిన మొదటి సినిమా ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఆచార్య సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొత్త కథ ఏమీ లేదని అంటున్నారు ప్రేక్షకులు. ఆఖండ సినిమాతో ఆచార్య సినిమాను పోల్చి చూస్తున్నారు. అఖండ.. ఆచార్య(Akhanda-Acharya).. ఈ రెండు సినిమాలు ఇంచుమించు ఒకటేలా ఉన్నాయని అంటున్నారు.
అసలు ఆఖండ, ఆచార్య సినిమాలో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? చిరంజీవి 2019లో సైరా నరసింహరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాలకృష్ణ 2019లోనే రూలర్ సినిమాతో వచ్చారు. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరి సినిమాలు ఒకేసారి మొదలయ్యాయి. ఆచార్య, అఖండ సినిమాలుగా తెరకెక్కాయి. కరోనాతో రెండేళ్ల తర్వాత వీరి సినిమాలు థియేటర్లకు వచ్చాయి.
కరోనా వేవ్ లెక్కచేయని బాలకృష్ణ అఖండను ముందే రిలీజ్ చేశారు. చిరంజీవి ఆచార్య సినిమాను కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారు. ధర్మాన్ని రక్షించడమనే కథతో రెండు సినిమాలు సాగాయి. మైనింగ్ మాఫియాపై పోరాటం అఖండ, ఆచార్య(Akhanda-Acharya) సినిమాలో కామన్‌గా కనిపించింది.
బాలకృష్ణ అఘోరాగా అఖండలో కనిపించి ధర్మాన్ని కాపాడాలంటూ పిలుపునిస్తారు. మైనింగ్ మాఫియాను అంతం చేస్తారు.
ఆచార్య సినిమాలో కూడా కామ్రెడ్‌గా కనిపించిన చిరంజీవి ధర్మం గురించి చెబుతారు. మైనింగ్ మాఫియాకు ఆచార్యగా చెక్ పెడతారు. అఘోరా, ఆచార్యల పాత్రకు హీరోయిన్ లేదు. ఏ సినిమాని చూసి ఏ సినిమా కాపీ కొట్టారోనని ప్రేక్షకులు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చాలా సినిమాల స్టోరీ ఒకేలా ఉన్నా.. తెరపైకి డిపరెంటుగా వచ్చేవి. కామన్ పాయింట్ ఒకేటేలా ఉన్నా సినిమా సినిమాకు చాలా తేడా ఉండేది. కానీ అఖండ, ఆచార్య(Akhanda-Acharya) ఒకే కాన్సెప్ట్ అంటున్నారు ప్రేక్షకులు.
Follow Us