Adivi Sesh's Major : విడుదలకు ముందే.. పూణె స్క్రీనింగ్‌లో జవానుల ప్రశంసలు పొందిన చిత్రం !

'మేజర్'.. తెలుగు నటుడు అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం. ఈ సినిమాలో 26/11 ముంబయి దాడుల్లో, మన నేల కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితానికి దృశ్యరూపం ఇవ్వనున్నారు

'మేజర్'.. తెలుగు నటుడు అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం. ఈ సినిమాలో 26/11 ముంబయి దాడుల్లో, మన నేల కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితానికి దృశ్యరూపం ఇవ్వనున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో ఆ ఎమోషన్స్‌ కనిపించాయి కూడా. అలాగే ఈ చిత్రం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి మరీ..  యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు.

'మేజర్' సినిమాలో అడివి శేష్‌తో పాటు.. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమా పాటలకు బాణీలను సమకూర్చగా.. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు మహేష్ బాబు స్వీయ నిర్మాణ సంస్థ GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. 


 

ఇటీవలే ఈ సినిమాను 10 రోజుల ముందుగా, భారతదేశంలో 9 ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్మాతలు భావించారు. అన్ని ప్రాంతాలలో ఒకేసారి కాకుండా.. ఒక్కో సిటిలో ఒక్కో షో వేయాలని ప్లాన్ చేశారు. 

అలా ఇటీవలే పూణెలో కూడా ఈ చిత్రం ప్రదర్శితమై, జవానుల ప్రశంసలు పొందింది. ఈ క్రమంలో ఆడిటోరియం మొత్తం జై హింద్, జై జవాన్ నినాదాలతో హోరెత్తింది. ముఖ్యంగా 21 పారా ఎస్ఎఫ్ వెటరన్ కమాండర్ శివరాజ్ తన కుటుంబంతో వచ్చి ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌ను వీక్షించి, అడివి శేష్‌ను అభినందించారు. షో పూర్తయ్యాక, ఉద్వేగాన్ని తట్టుకోలేక గాఢంగా హత్తుకున్నారు. ఈ వీడియోను శేష్, తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. 'మేజర్' చిత్రం జున్ 3 వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Credits: Instagram
You May Also Like These