టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్డేట్స్ని అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు హీట్ పుట్టించే పోస్ట్ లతో నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. తన ఫొటోలతో ప్రేక్షకులకు అందాల విందు చేస్తోంది. మతిపొగొట్టే భంగిమలతో పిచ్చెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ప్రముఖ (Peacock Mgazine) మ్యాగజైన్ కోసం నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత (Samantha) ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందులో 'నా స్కిన్టోన్తో నేను కంఫర్టబుల్గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది.. కానీ చాలా సినిమాలు చేసిన అనంతరం ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్ కానీ హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు' అంటూ పేర్కొంది. ఈ ఫొటోల్లో సామ్ ముదురు ఆకుపచ్చ రంగు డిజైనింగ్ డ్రెస్ లో అచ్చం పీకాక్ లా పురివిప్పింది. ఈ పోజ్ లో ఆమె ఎద అందాలు హైలైట్ అయ్యాయి. మరో పోజులో లైట్ పింక్ కలర్ డ్రెస్ ధరించి బ్యాక్ అందాలను ఆరబోసింది. ఇక సామ్ లేటెస్ట్ ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది.
అయితే, పీకాక్ మాగజిన్ పై ఎక్కువగా బాలీవుడ్ తారలే కనిపిస్తారు. కాగా, సామ్ బాలీవుడ్ (Bollywood) లో ఇది వరకు 'ది ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్, పుష్ప ఐటమ్ సాంగ్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే టాప్ బ్రాండ్స్ లో సమంత వెంట పడుతున్నాయి. ఇక, ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్&డీకే రూపొందిస్తున్న మరో వెబ్ సిరీస్ లో సమంత ప్రధాన పోషిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తెలుగులో సమంత నటించిన శాకుంతలం ఆగస్టు 12న విడుదలకు సిద్దంగా ఉంది. మరో సినిమా యశోధ షూటింగ్ దశలో ఉంది.
Follow Us