Liger Poster: 'లైగర్' సినిమా కోసం విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్.. మన హీరోయిన్ల రియాక్షన్ ఇదే!

అనన్య పాండే, విజయ్, సమంత (Ananya Pandey, Vijay, Samantha)

Liger Poster: డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘లైగర్’ . పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్‌ (Karan johar) తో కలసి పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. 

అందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా సంచలన పోస్టర్ విడుదలయిన సంగతి తెలిసిందే. నగ్నంగా ఉన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  కొన్ని గులాబీలు పట్టుకుని ఉండడం ఆ పోస్టర్ లో చూడవచ్చు. విజయ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. అందుకే కాస్తంత సెక్సీగా పోస్టర్‌ను డిజైన్ చేశారు మేకర్స్. అయితే, ఈ పోస్ట‌ర్ ను షేర్ చేసుకొంటూ విజయ్ దేవరకొండ, "ఈ సినిమా నా స‌ర్వ‌స్వాన్ని లాగేసుకుంది. ఒక నట‌న‌లో, మానసికంగా, శారీరకంగా. నా అత్యంత సవాలుతో కూడిన పాత్ర. నేను మీకు అన్నీ ఇస్తాను! త్వరలో వస్తుంది. లైగర్" అని ట్వీట్ చేశాడు.  

అయితే, లైగర్ పోస్టర్ పై టాలీవుడ్ ముద్దుగుమ్మలు స్పందించారు. సమంత (Samantha) స్పందిస్తూ... లైగర్ పోస్టర్ అదిరిపోయిందని వ్యాఖ్యానించింది. ఈ పోస్టర్ లో విజయ్ చాలా బోల్డ్ గా ఉన్నాడని, అలా కనిపించడానికి ధైర్యం కావాలని సమంత ప్రశంసించింది. విజయ్ కి రూల్స్ తెలుసని, వాటిని బ్రేక్ చేయగలడని పేర్కొంది. 

ఇక హీరోయిన్ అనుష్క (Anushka Shetty) కూడా రియాక్ట్ అయ్యింది. ‘‘పూరి సార్ మీ మ్యూజిక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే ది బెస్ట్ లా నిలవాలి. విభిన్నమైన కథలు అందిస్తున్న చార్మికి, కరణ్ జోహర్ కు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేసింది.

 

ఇక, లైగర్ హీరోయిన్ (Ananya Pandey) అనన్య పాండే, “బ్రీత్ గైస్, బ్రీత్… ఈరోజు భారతదేశం అంతటా వేడి పెరుగుతోంది. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

 

Read More: Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కోసం లేడీ వీరాభిమాని.. ఏం చేసిందో చూశారా?

You May Also Like These