‘సీతారామం’ (Sita Ramam) ఎక్కువ మంది ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నసినిమా. ప్రేక్షకుల మనసును తాకే ప్రేమ కావ్యాన్ని దర్శకుడు హను రాఘవపూడి అందించారు. రామ్‌గా దుల్కర్ సల్మాన్.. సీతగా మృణాల్ ఠాకూర్ నటించి మెప్పించారు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచారు. సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఓ సీన్ డిలీజ్ చేశారట. పాకిస్థాన్‌లో దుల్కర్, సుమంతలకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని డిలీజ్ చేశారు. ఆ డిలీటెడ్ సీన్‌ను దర్శకుడు హను రాఘవపూడి తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
50 రోజులు పూర్తి
'సీతారామం' సినిమాలో దుల్కర్ సల్మాన్, సుమంత్‌లు ఆర్మీ అధికారులుగా నటించారు. వీరిద్దరు సీక్రెట్ మిషన్‌లో భాగంగా పాకిస్థాన్‌కు వెళతారు. పాకిస్థాన్‌లో జీహాదీలను అంతం చేసే క్రమంలో పాక్ ఆర్మీకి దొరికిపోతారు. దుల్కర్, సుమంతలు పాక్ జైల్లో బంధీలుగా ఉంటారు. పాక్ ఆర్మీ అధికారి సాయంతో దుల్కర్, సుమంత్ కాసేపు జైలు నుంచి బయటకు వస్తారు. దుల్కర్ సల్మాన్‌ను సుమంత్ అనాథ అంటూ నిందిస్తారు. ఆ సన్నివేశాన్ని 'సీతారామం' నుంచి తొలగించారు. 'సీతారామం' (Sita Ramam) సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో దర్శకుడు ఈ సన్నివేశాన్ని రిలీజ్ చేశారు.
50 డేస్ పోస్టర్
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్ 'సీతారామం' సినిమాను నిర్మించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' చిత్రం ఆగస్టు 5 తేదిన విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే థియేటర్లను షేక్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాను ఇటీవలే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. బాలీవుడ్‌లోనూ 'సీతారామం' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. 'సీతారామం' (Sita Ramam) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సక్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Follow Us