9 Years for Attarintiki Daredi : పవన్ కళ్యాణ్ చిత్రం "అత్తారింటికి దారేది"కి 9 ఏళ్ళు.. టాప్ 10 విశేషాలివే

పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించి టాప్ 10 సినిమాల జాబితాను తయారుచేస్తే, అందులో 'అత్తారింటికి దారేది' చిత్రం కచ్చితంగా ఉంటుంది.

అత్తారింటికి దారేది (Attarintiki Daredi) .. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మామూలు రికార్డులు తిరగరాయలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పవర్ స్టార్ చేసిన మ్యాజిక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. 

పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించి టాప్ 10 సినిమాల జాబితాను తయారుచేస్తే, అందులో 'అత్తారింటికి దారేది' చిత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 9 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ సినిమా గురించి టాప్ 10 విశేషాలు మీకోసం 

ఫస్ట్ ఛాయిస్ ఇలియానా
'అత్తారింటికి దారేది' సినిమాలో కథానాయికగా తొలుత ఇలియానాని అనుకున్నారట. అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, అదే అవకాశం సమంతకు దక్కింది. అయితే ఈ సినిమా సక్సెస్‌తో సమంత పాపులారిటీ మరింత పెరిగిందనే చెప్పాలి.

బొమన్ ఇరానీకి తొలి తెలుగు సినిమా
మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన బొమన్ ఇరానీకి 'అత్తారింటికి దారేది' తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో కళ్యాణ్ తాతయ్య రఘునందన్ పాత్రలో ఇరానీ ఒదిగిపోయారు. 

12 సంవత్సరాల తర్వాత
నటి ముంతాజ్ 'ఖుషీ' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఓ స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ పక్కన  ఓ ప్రత్యేక గీతంలో నటించడం విశేషం.

ఇంట్రడక్షన్ సీన్‌కి రూ.2 కోట్లు
'అత్తారింటికి దారేది' (Attarintiki Daredi) చిత్రంలో కేవలం ఇంట్రడక్షన్ సీన్‌కే రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారట. స్విట్జర్‌లాండ్‌లోని ఓ దీవిలో ప్రత్యేకంగా ఈ సీన్ షూట్ చేశారట. ఈ సీన్ కోసం ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన హెలికాఫ్టర్లు వాడారట. 

యాంకర్ అనసూయకు మిస్ అయిన ఛాన్స్
ఈ సినిమాలో ముంతాజ్, హంసానందినిలతో షూట్ చేసిన ప్రత్యేక గీతంలో యాంకర్ అనసూయ కూడా నటించాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. 

పైరసీ బారిన పడి..
ఈ సినిమా పైరసీ బాడిన పడింది. సినిమా రిలీజ్ కాకముందే, సగానికి సగం చిత్రం బయట ఫోన్లలో సర్క్యులేట్ అయ్యింది. సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసి, ఈ పైరసీకి పాల్పడిన వ్యక్తులను అరెస్టు కూడా చేయించడం జరిగింది. 

టెలివిజన్ రైట్స్
'అత్తారింటికి దారేది' టెలివిజన్ రైట్స్ దాదాపు రూ.9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయట. ఆ రోజులలో ఒక సినిమా కోసం ఓ ఛానల్ అంతమొత్తం వెచ్చించడం ఒక రికార్డు

అవార్డులు
'అత్తారింటికి దారేది' నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు, ఆరు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే నాలుగు నంది అవార్డులను కూడా చేజెక్కించుకుంది. 

రీమేక్ చిత్రాలు
'అత్తారింటికి దారేది' చిత్రం కన్నడంలో సుదీప్ హీరోగా 'రణ్ణ' పేరుతో రీమేక్ అయ్యింది. అలాగే తమిళంలో శింబు హీరోగా 'వంత రాజవతాన్ వరువేన్' పేరుతో.. అలాగే బెంగాలీలో జీత్ హీరోగా 'అభిమాన్' పేరుతో రీమేక్ అయ్యింది.

కొత్త రికార్డులు తిరగరాస్తూ..
'అత్తారింటికి దారేదీ' చిత్రం లైఫ్ టైమ్ కలెక్షన్‌లో రూ.77.88 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించగా, రూ.187 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీ లాభాలనే ఆర్జించింది. 

 

మరిన్ని విశేషాలు
బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి ప్రధాన హైలెట్. బద్దం భాస్కర్ పాత్రలో కొత్తరకం కామెడీతో ఆయన నవ్వులు పూయించాడు. అలాగే సిద్ధప్ప పాత్రలో కోట శ్రీనివాసరావు చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడు.  ఇక సమంత చెల్లెలి పాత్రలో ప్రణీత సుభాష్ కూడా మంచి గ్లామర్ పాత్రను పోషించింది.

అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అత్తయ్య పాత్రలో నదియా నటన అద్భుతమనే చెప్పాలి. ఆ చిత్రంలో నటనకు గాను ఆమె ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు కూడా అందుకుంది. 

ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. మంచి క్యాచీ ట్యూన్లు అందించాడు. 'కాటమరాయుడా కదిరినరసింహుడా' పాటకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బాణీలు సమకూర్చమని తెలిపారు. 

ఏదేమైనా, 'అత్తారింటికి దారేది' చిత్రానికి ఆ రోజులలో ఊహించని బ్లాక్ బస్టర్ దక్కింది. పవర్ స్టార్ అభిమానులకు ఎప్పటికీ ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. 

Read More: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ బర్త్ డే పోస్టర్ !

Credits: Instagram
You May Also Like These