‘చార్లి నేనంటే నీకెంత ఇష్టం’ అని కుక్కను ప్రశ్నిస్తాడు రక్షిత్‌శెట్టి.. అంతే వెంటనే కుక్క వచ్చి తనను హత్తుకుంటుంది. ట్రైలర్‌లో ఈ సీన్ హైలైట్‌గా నిలిచింది. ‘నా పేరు ధర్మ, నా జీవితంలో ఆసక్తిగా ఏమీలేదు. ఇల్లు, ఫ్యాక్టరీ, గొడవలు, ఇడ్లీ, సిగరెట్, బీర్ ఇదే నా జీవితం. చూసే వాళ్ల దృష్టిలో నేను రాంగ్ కావచ్చు. కానీ నా వరకు నేనే కరెక్ట్’ అని హీరో రక్షిత్ శెట్టి సినిమాలో తన క్యారెక్టర్‌ను తానే పరిచయం చేసుకుంటున్నాడు. జూన్ 10వ తేదీన 777 చార్లి సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను తెలుగులో రానా (Rana Daggubati) విడుదల చేయనున్నాడు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది.
మూగజీవాలను చిన్నచూపు చూసే కొంతమందిని గురించి, కుక్కలను వాటి యజమానులకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించే ఫీల్ గుడ్ కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్. కొన్ని సంఘటనల కారణంగా హీరోకి, కుక్కకి మధ్య ఏర్పడిన అనుబంధం వంటి ఆసక్తికర విషయాలతో సినిమా రూపొందింది.
కన్నడ హీరో రక్షిత్‌శెట్టి హీరోగా నటించిన సినిమా ‘777 చార్లి’. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనుంది. 777 చార్లి సినిమా తెలుగు ట్రైలర్ సోమవారం విడుదల కానుందని, ఈ ట్రైలర్‌ను పలువురు సెలబ్రిటీలు లాంచ్ చేయనున్నారనే సంగతి తెలిసిందే.. సోమవారం మధ్యాహ్నం 12:12 నిమిషాలకు విక్టరీ వెంకటేష్, సాయి పల్లవి, మంచు లక్ష్మి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రానా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకున్న రానా (Rana Daggubati).. ప్రస్తుతం సినిమా సమర్పకుడిగా కూడా మారుతున్నాడు. పాన్ ఇండియా మూవీ 777 చార్లి సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నాడు.
‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో రక్షిత్‌శెట్టి. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ‘777 చార్లి’ సినిమా తెరకెక్కించాడు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది.
చార్లి అనే కుక్క పిల్ల ఇంట్లో నుంచి బయటికి వచ్చి తప్పిపోతుంది. ఈ పరిస్థితుల్లో బయట చార్లి పడిన ఇబ్బందులు ఏమిటి. ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య రిలేషన్ ఏంటి. చివరకు ఏం జరిగింది. 777 చార్లి అనే అడ్వంచరస్ కామెడీని సినిమా ద్వారా చూపించబోతున్నాడు. జీఎస్ గుప్తాతో కలిసి పరమ్‌వహ్ బ్యానర్‌పై సినిమాను రక్షిత్‌శెట్టి నిర్మిస్తున్నాడు. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత శ్రింగేరి, రాజ్ బి.శెట్టి, డానిష్ సెయింట్, బాబీ సింహ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 777 చార్లి సినిమాలో సంగీత శృంగేరీ, రాజ్ బి శెట్టి, డానిష్ సేత్, బాబి సింహా కీలక పాత్రలు చేశారు.
Follow Us