Biggboss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేట్!

Advertisement
న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Natraj Master)

తెలుగు బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో (Biggboss Nonstop) చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు 10 మంది ఎలిమినేట్‌ అయ్యారు.  వారిలో శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మహేశ్‌, అజయ్‌, హమీదా, అషూ వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. ఈ నేప‌థ్యంలో మ‌రో నేడు మరో ఎలిమినేషన్‌ జరగబోతోంది. అయితే ఈ షో సగం దాకా వచ్చాక డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్కర్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత‌ ఈమధ్య ఇచ్చిన ఓ టాస్క్‌లో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కూడా గెలుచుకోవడంతో అతడు ఖ‌చ్చితంగా ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.  

ఇదిలా ఉంటే.. ఈ వారం బిగ్ బాస్ (Biggboss Nonstop) హౌస్ లోని ఇంటి స‌భ్యులంద‌రూ నామినేషన్‌లో ఉన్నారు. ఇక‌, ప్రేక్ష‌కుల‌ ఓటింగ్ లో ఎప్పటిలాగే అఖిల్‌, బిందుకు పోటాపోటీగా ఓట్లు పడుతున్నాయి. దీంతో వీరిద్ద‌రూ సేఫ్‌ జోన్‌లో ఉన్నారు. వీరి తర్వాత బాబా భాస్క‌ర్, యాంక‌ర్ శివకు సైతం భారీగానే ఓట్లు పడుతున్నాయి. కాబట్టి ఈ వారం వీళ్లు కూడా బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ బాబా డేంజర్‌ జోన్‌లో ఉన్నా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ఉండ‌డంతో ఈజీగా గండం గట్టెక్కుతాడు. ఇక‌, మిగిలిన వారిలో మిత్ర శ‌ర్మ‌, అరియానా గ్లోరీ, అనిల్‌కు ఓ మోస్త‌రుగానే ఓట్లు వస్తున్నాయి. అయితే, నటరాజ్‌ మాస్టర్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం నటరాజ్‌ మాస్టర్‌ ఇంటినుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. అన‌ధికార పోలింగ్ లో కూడా మాస్టర్ ఎలిమినేట్ అవుతున్నట్టు రిజల్ట్ వచ్చింది. దాదాపు 60 శాతం మంది ఈవారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాబోతున్నారని ఓట్లు వేశారు. 

Advertisement

అయితే.. మొదటి నుంచీ కష్టపడి ఆడుతూ వస్తున్న నటరాజ్‌ మాస్టర్‌ (Nataraj Master) ఈ సీజన్‌లో ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయం మొద‌ట్లో అంద‌రూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నామినేషన్స్‌లో బిందు మాధ‌వితో, టాస్క్‌లో అఖిల్‌తో గొడ‌వ‌ పెట్టుకుని నెగెటివిటీ పెంచుకున్నాడు. ఫలితంగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ పదకొండో వారంలోనే బిగ్‌బాస్‌ హౌస్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు. కాగా, నిన్నటి ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ లేడీ గెటప్‌లో అదరగొట్టేశాడు. హౌస్ లోకి గెస్ట్‌గా వచ్చిన అనసూయను మెప్పించి ఆమె ద్వారా ఓటర్లను ఓటు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొందాడు. ఇక‌, సీజన్ స్టార్టింగ్ నుంచి సైతం నటరాజ్ మాస్టర్ ఫిజికల్ టాస్క్‌లలో.. ఎంటర్టైన్మెంట్ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్టుగా వినోదాన్ని పంచాడు. కానీ, నేను సింహం.. నేను సింగిల్.. అంటూ దూకుడుగానే ఆడుతూ.. చివరకిి బొక్కబోర్లా పడ్డారు.

Credits: instagram
Advertisement
You May Also Like These
Advertisement