టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్థాపించిన ‘ఆహా’.. తెలుగులో ప్రస్తుతం లీడింగ్ ఓటిటి సంస్థ అన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఈ సంస్థ విభిన్న పద్ధతుల్ని ఫాలో అవుతోంది. ఇప్పటికే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ వంటి టాక్ షో నిర్విహించింది. దీంతో పాటు కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తూ తన సత్తాని చాటుతోంది. అంతేకాకుండా తాజాగా కొన్ని కొత్త సినిమాలని హై క్వాలిటీ వెర్షన్లలో విడుదల చేసే పద్దతిని కూడా ఆహా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్త టాలెంట్ ను వెలికితీసేందుకు.. హిందీలో మాదిరిగానే తెలుగులోనూ ఇండియన్ ఐడల్ షో (Telugu Indian Idol) ను కూడా ప్రారంభించారు. టాలీవుడ్ కు గాన గంధర్వులని అందించడమే లక్ష్యంగా.. ఆహా ఈ షోని నిర్వహిస్తోంది.
గత సీజన్ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్, సింగర్ అయిన శ్రీరామ్ చంద్ర ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా హీరోయిన్ నిత్యా మేనన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ కార్తీక్ వంటి వారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ సింగింగ్ షో ఇప్పటికే 22 ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే, ఈ షో 23వ ఎపిసోడ్ నేటి రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కు ఓ స్పెషాలిటీ ఉండబోతోంది. టాలీవుడ్ (Tollywood) స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పెషల్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ ను ‘లిరిసిస్ట్ స్పెషల్’ గా ప్రమోట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రస్తుతం పోటీలో ఉన్న 9 మంది సింగర్స్ లో 3 మంది టాలెంటెడ్ సింగర్స్ ను ఫిల్టర్ చేయనున్నారు రామజోగయ్య శాస్త్రి. మరి ఆ 9 మంది కంటెస్టెంట్స్ లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరో రాబోయే ఎపిసోడ్లలో తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే... నిన్నటి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ (Telugu Indian Idol) ఎపిసోడ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కంటెస్టెంట్ వాగ్దేవి జడ్జి థమన్ ఆకాశానికెత్తేశాడు. ఆమె ఈ షో ‘రంగ్‌దే’ సినిమాలోని పాట పాడింది. అయితే, ఆమె పాట సార్ట్ చేసిన మరుక్షణం నుంచే జడ్జ్ గా ఉన్న థమన్ రియాక్షన్స్ మారుతూ వచ్చాయి. ఆమె పాడిన పాట పై తన అభిప్రాయం చెబుతూ “వాగ్దేవీ.. నువ్వు రాబోయే పదిహేను, ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతావు’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ మాటలకు కంటెస్టెంట్ వాగ్దేవీ కూడా ఆశ్చర్యపోవడం విశేషం.
Follow Us