ఓటీటీ బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో బాగా ఆకర్షించిన మరో కొత్త ప్రోగ్రామ్. సంప్రదాయ బిగ్ బాస్ షోకి భిన్నంగా నిర్వాహకులు ఈ షోని తీర్చిదిద్దారు. టీవీలో కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయకుండా, ఒక నాన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోగా కేవలం ఓటీటీకి మాత్రమే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశారు. ఎప్పటిలాగే కింగ్ నాగార్జునే ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్స్‌తో పాటు, కొత్తవారు కూడా ఈ షోలో పాల్గొనడం విశేషం. పాత కంటెస్టెంట్స్‌కు కౌంటర్ ఇస్తూ.. కొత్త కంటెస్టెంట్స్ ఆటను ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తమదైన శైలిలో రచ్చ రచ్చ చేస్తున్న అటువంటి కంటెస్టెంట్స్ గురించి మనమూ తెలుసుకుందామా
బిందుమాధవి (Bindu Madhavi)
ఆవకాయ బిర్యానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి బిందు మాధవి. తర్వాత బంపర్ ఆఫర్, ఓం శాంతి, పిల్ల జమిందార్ లాంటి సినిమాలలో నటించింది ఆమె. ఆ తర్వాత టాలీవుడ్‌కి కొన్నాళ్లు గుడ్ బై చెప్పి, తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తమిళ బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొంది. ఇప్పుడు మళ్లీ తెలుగు బిగ్ బాస్ నిర్వహిస్తున్న నాన్ స్టాప్ షోలో తనదైన శైలిలో సత్తా చాటుతోంది. ఏదైనా ముఖం మీద గుద్దినట్లు మాట్లాడడం ఈమె నైజం. కౌంటర్‌కి తిరిగి కౌంటర్ ఇవ్వడం తనకు అలవాటు. ఈమె గేమ్ ఆడే పద్ధతి ఆమెకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
యాంకర్ శివ (Anchor Siva)
అలాగే ఈసారి పెద్ద అంచనాలు లేకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ బరిలోకి దిగిన మరో కంటెస్టెంట్ యాంకర్ శివ. ఈయన చేసిన అనేక యూట్యూబ్ ఇంటర్వ్యూలు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. సాధారణంగా ఇరిటేట్ చేసే ప్రశ్నలు వేస్తూ, సెలబ్రిటీలను కాస్త అసహనానికి గురి చేయడం ఇతని ఇంటర్వ్యూలో ప్రత్యేకత. అయితే కొన్ని మంచి ఇంటర్వ్యూలు కూడా చేసి, తన రంగంలో ఇప్పుడిప్పుడే స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు ఇతడు. ఓటీటీ బిగ్‌బాస్ అనేది ఇతనికి అనుకోకుండా దక్కిన అవకాశం. తను కూడా తనదైన స్టైల్‌లో గేమ్‌ను ఆసక్తికరంగా ఆడుకుంటూ ముందుకు పోతున్నాడు. అయితే మాటల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండమని, నాగార్జున ఇతన్ని క్లాస్ పీకడంతో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అయినా గేమ్‌ను వైవిధ్యంగా ఆడుతున్నాడనే చెప్పాలి.
అరియానా గ్లోరి (Ariyana Glory)
బిగ్ బాస్ ప్రేక్షకులు అరియానా గ్లోరీ కొత్తేమీ కాదు. ఆర్జీవి ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ యాంకర్, సీజన్ 4 లో తనదైన శైలిలో ఆడింది. అంతే కాదు.. ఎవరూ ఊహించని విధంగానే అనతికాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాన్ బేస్‌తో టాప్ 5 లో కూడా నిలిచింది. ఒక రకంగా ఆ సీజన్‌లో లేడీస్‌ని అందరినీ దాటుకొని ముందుకెళ్లిపోయింది. ఓ కొత్త అమ్మాయికి అంత పాపులారిటీ రావడం అంటే ఆషామాషీ కాదు. అయితే ఓటీటీ బిగ్ బాస్‌లో ఈమె డబుల్ స్టాండర్డ్స్‌తో ఆడుతోందని కొందరు పెదవి విరిచారు. అయినప్పటికీ తనదైన పద్థతిలో ఆమె దూసుకుపోతోంది.
అషు రెడ్డి (Ashu Reddy)
అచ్చం సమంతలా ఉంటుందని ఒకప్పుడు టిక్ టాక్‌లో ఈమె అభిమానులు అనేవారు. ఆ ఫేమ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 లో తన లక్ పరీక్షించుకుంది. కానీ ఊహించని స్థాయిలో ఆమె పెర్ఫామ్ చేయలేదని చాలామంది అంటూ ఉంటారు. పైగా ఈమె వేగంగానే ఎలిమినేట్ అయిపోయింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఈమెకు వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. సొంతంగా యూట్యూబ్ పెట్టుకుంది. అలాగే జబర్దస్త్ లాంటి టీవీషోలలో పాల్గొని తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ బిగ్ బాస్‌లో కూడా తనదైన స్టైల్‌లో గేమ్ ఆడుతోంది.
అజయ్ కతుర్వార్ (Ajay Kathurwar)
విశ్వక్, అలాంటి సిత్రాలు… లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అజయ్ కతుర్వార్. ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు. ఓ యాక్సిడెంట్‌కి గురయ్యాక, తన కాళ్లూ, చేతులూ పడిపోయాయని, ఆ స్థితి నుండి రావడానికి తాను చాలా కష్టపడ్డాడని ఈయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదే పోరాట పటిమను బిగ్ బాస్ షోలో ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే, తనదైన శైలిలో విభిన్నంగా దూసుకుపోతున్నాడు అజయ్.
అఖిల్ సార్తక్ (Akhil Sartak)
అఖిల్ సార్తక్.. బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నరప్‌గా నిలిచిన కంటెస్టెంట్. తనకున్న కాన్ఫిడెన్స్ లెవల్స్‌తో గేమ్ అంచనాలను మార్చగల కంటెస్టెంట్. అయితే తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే అన్న టాక్ ఉంది. కానీ ఏదేమైనా, గేమ్ విషయానికి వచ్చేసరకి 100 % ఇతడు కచ్చితంగా ఇస్తాడని, అతని అభిమానులు నమ్ముతూ ఉంటారు. సీజన్ 4 కు సంబంధించిన ఫినాలేలో నాగార్జున విజేతను ప్రకటిస్తూ.. అఖిల్ చేయిని నిర్దాక్షిణ్యంగా కింద పడేయడంతో అప్పట్లో అదో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సీజన్‌లో గుజరాతీ భామ మోనల్, అఖిల్‌ల మధ్య నడిచిన కెమిస్ట్రీ కూడా టాక్ ఆఫ్ ది బిగ్ బాస్‌గా నిలిచింది. ఏదేమైనా, ఈ సీజన్‌లో అఖిల్ బలంగానే ఆడుతున్నాడు. సవాలుకి, ప్రతి సవాలు విసురుతున్నాడు.
Follow Us