డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) షో రోజురోజుకు కొత్త కొత్త గొడవలతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. అయితే, ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వారిలో ఎవరు టాప్ ఫైవ్ లో కి వెళ్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో రొటీన్ గా ఐదు మందిని కాకుండా అంతకంటే ఎక్కువ మందిని ఫైనల్స్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అయితే, గ్రాండ్ ఫినాలేకు మిగిలిన రెండు వారాల్లో ఊహించని ఎలిమి నేషన్స్ తో మరింత ఆసక్తికరంగా మార్చాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు.
ఇక, పదవ వారంలో కి అడుగు పెట్టబోతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) లో ఈసారి ఎలిమినేషన్స్ విషయంలో పెద్దగా సీక్రెట్ మెయింటైన్ చేయలేకపోయిన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సీజన్ లో లాగానే ఈ సారి కూడా ఆదివారం జరిగే ఎలిమినేషన్ ఎపిసోడ్ కంటే ముందే హౌస్ లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో ప్రేక్షకులు ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. అయితే, ఈ సీజన్ లోనూ మొదట్లో కొంత తడబడినా.. ఇప్పుడు మాత్రం ఎవరు వెళ్ళిపోతున్నారో ముందే తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి అషు రెడ్డి వెళ్లి పోవడం ఖాయమని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం మొత్తం తొమ్మిది మంది ఉన్న హౌస్ లో ఈ వారం అషు రెడ్డి వెళ్ళిపోతే మిగతా ఎనిమిది మందిలో ఫైనల్స్ వరకు ఎవరు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మిగిలిన 8 మందిలో అందరూ ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల్లో వారికి మద్దతు కూడా పెరుగుతోంది. ఇక వారం వారం ఓట్ల విషయంలో కూడా చాలా నెంబర్లు మారిపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ సరికొత్త ఫైనల్ ఎపిసోడ్ తో ముగించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ లోనూ ఆట తుది దశకు వచ్చేసరికి టాప్ ఫైవ్ లిస్టు ని కన్ఫమ్ అవుతుంది. కానీ, ఈసారి మాత్రం 5మంది కంటే ఎక్కువగా మొత్తం ఆరుగురిని ఫైనల్ సిక్స్ ఓకే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఫైనల్స్ వరకు ఎవరు వెళ్తారనే విషయం కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. వీరిలో అఖిల్ సార్ధక్, బిందుమాధవి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అరియానా, అనిల్.. తప్పకుండా టాప్ 6లో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow Us