BiggBoss Nonstop: అఖిల్ తో గొడ‌వ‌ప‌డిన వారంద‌రూ ఎలిమినేట్ అవుతున్నారా?

Advertisement
అఖిల్, న‌టరాజ్ మాస్ట‌ర్ (Akhil, Natraj Master)

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో (BiggBoss Nonstop) ప్రారంభ‌మై చాలా రోజుల‌యింది. మొద‌ట్లో ఈ షో పై అంత‌గా ఆస‌క్తి లేక‌పోయిన‌ప్ప‌టికీ.. రోజులు గ‌డిచే కొద్దీ ఆస‌క్తిగా మారుతోంది. అయితే ఈ షో ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. మ‌రో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలో జ‌రుపుకోబోతోంది. 17 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మయిన బిగ్ బాస్ షో లో ఇప్ప‌టివ‌ర‌కు 10మంది ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ అయ్యారు. నేడు ప‌ద‌కొండో ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో షో లో మొదటి నుంచీ ఒంటరిగా పోరాడుతూ వస్తున్న నటరాజ్‌ మాస్టర్ ఎలిమినేట్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

మొద‌టినుంచీ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Natraj Master) రూటే స‌ప‌రేటు. ఈ నేప‌థ్యంలో గ‌త‌ వారం నామినేషన్స్‌‌కి వచ్చేసరికి ఆయనలోని కొత్త మాస్టర్ బయటకు వచ్చేశారు. ముఖ్యంగా గడిచిన‌ రెండు వారాలుగా ఆయన ప్రవర్తనపై విమర్శలు వ‌స్తూనే ఉన్నాయి. పోయిన‌ వారంలో టైటిల్ రేస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన‌ బిందు మాధవితో దారుణంగా గొడవపడ్డాడు. ఆమెను వ్యక్తిగతం దూషించాడు. దీంతో ప్రేక్ష‌కులు ఆయ‌న దారుణంగా విమర్శించారు. గొడ‌వ‌లో భాగంగా ఆమె ప్రొఫెషన్‌‌ని కూడా మాస్టర్ టార్గెట్ చేశారు. ఆమెకు టాలీవుడ్ లో అస‌లు సినిమా అవ‌కాశాలే లేవని.. తమిళ్‌లో చేస్తుందని.. ఇప్పుడు బిగ్ బాస్ తరువాత మళ్లీ చెన్నై వెళ్లిపోతుందని.. బిందు మాధవికి పిచ్చిపట్టిందంటూ నోరు జారారు. దీంతో బిందు మాధవి కూడా ఎక్క‌డా తగ్గలేదు.. ఆయన ఒక్క మాట అంటే నేను రెండు అంటా అన్నట్టుగా రెచ్చిపోయింది. 

Advertisement

ఇక‌, కీలకమైన చివరి వారంలో మ‌రో కంటెస్టెంట్ అఖిల్‌తో (Akhil sartak) గొడవ పడటం ఆయనకి బాగా మైనస్ అయ్యింది. దాంతో పాటు.. అఖిల్‌కి క్లోజ్‌గా ఉన్న వాళ్లు.. అతనితో గొడవపడిన వారంలో ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. స్రవంతి, అజయ్, అషు.. ఈ ముగ్గురూ కూడా అఖిల్‌కి బాగా క్లోజ్‌గా ఉండేవారు. అయితే ఏ వారం అయితే వాళ్లు నామినేషన్స్‌లో ఉండి.. అఖిల్‌తో గొడవపడ్డారో.. అదే వారంలో ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యిందని చెప్పవ‌చ్చు.
 

Credits: instagram
Advertisement
You May Also Like These
Advertisement