BiggBoss NonStop : బాబా భాస్క‌ర్ చేతిలో ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

Advertisement
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో (Biggboss Nonstop Show)

బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss NonStop) షో చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మ‌రో రెండు, మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రాబోతోంది. ఈ నేప‌థ్యంలో నేడు ఓ కంటెస్టెంట్ కాబోతున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ సీజన్5 విన్నర్ అయిన సన్నీ వచ్చి, ఇంటి స‌భ్యుల‌తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని ఆడించాడు. ఈ వారం మొత్తం గత సీజన్ లో టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లందరూ ఒక్కొక్క‌రుగా వచ్చారు. వారు ఒక్కొక్కొరు ఒక్కో టాస్క్ ని ఆడించి చివ‌ర‌కు నలుగురిని ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఆడేందుకు రెడీ చేశారు. 

అంతేకాకుండా, కంటెస్టెంట్ల‌కు మిస్టరీ బాక్స్ ని సైతం ఇచ్చి ఫ‌లితాల‌ను కూడా తారుమారు చేశారు. ఇక సన్నీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఆయ‌న పేరు తీసుకుని వచ్చిన మంకీ టాస్క్ ని ఆడించారు. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడే నలుగురు ఇంటిస‌భ్యులు మంకీ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో బాబా భాస్క‌ర్ (Baba Bhaskar) రెండు సార్లు, అఖిల్ రెండు సార్లు టాస్క్ ల్లో గెలిచారు. చివరకి తమతో పాటు గేమ్ ఆడేందుకు అరియానాకి అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్ అయిపోగానే సన్నీ గ్రాండ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వ‌చ్చీ రాగానే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మ‌ధ్య‌ జోష్ ని నింపాడు. అంతేకాకుండా గ‌త సీజ‌న్ లో మాదిరిగానే తనదైన స్టైల్లో మచ్చా అంటూ మాట్లాడుతూ పాత రోజుల‌ను గుర్తు చేశాడు సన్నీ. ఇక‌, గత సీజన్ లో త‌ను గెలుచుకున్న‌ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని వాళ్ల అమ్మ కళావతి హౌస్ లోకి తీసుకుని వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. బిగ్ బాస్ (BiggBoss NonStop) హౌస్ మొత్తం క‌లియ‌ తిరుగుతూ తన ఫేవరెట్ ప్లేస్ లని చూస్తూ ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకున్నాడు.

Advertisement

ఇక‌, స‌న్నీ ఉన్నంత‌సేపు హౌస్ మేట్స్ తో టాస్కులు ఆడించి.. ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేశాడు. అనంత‌రం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో బాబా భాస్కర్ గెలవగానే ఇంటి స‌భ్యులంద‌రూ ఆనందించడాన్ని స‌న్ని అభినందించాడు. తాను పాల్గొన్న‌ సీజన్ లో ఇలా లేదని, నేను పాస్ సాధించినప్పుడు ఎవ్వరూ ఆనందంగా లేరని గుర్తు చేసుకున్నాడు. ఇలా ఎంకరేజ్ చేసే హౌస్ మేట్స్ ఉంటే మ‌రింత‌ బాగా ఆడొచ్చని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే.. బాబా భాస్కర్ ఈవారం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడతారా ? లేదంటే వచ్చే వారం వాడతారా అనేది ప్ర‌స్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయ‌న‌ నామినేషన్స్ లో ఉంటే ఖచ్చితంగా అది తనకోసమే వాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నామినేషన్స్ లో ఆయన లేకపోతే ఎవరి కోసం వాడతారనేది గెస్ చేయలేని పరిస్థితి నెల‌కొంది. ఎందుకంటే, బాబాభాస్కర్ స్వ‌త‌హాగా అప్పటికప్పుడు డెసీషన్స్ తీస్కునే వ్య‌క్తి. అయితే, తను మిత్రా కోసం గేమ్ ఆడి ఒక్క టాస్క్ కూడా గెలవలేదు. కాబట్టి, ఆమె కోసం కూడా ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ను వాడే అవకాశం ఉంది. మ‌రోవైపు, అరియానా కోసం కూడా ఈపాస్ ని వాడవ‌చ్చు. చూడాలి మరి బాబాభాస్కర్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఎలా ఉపయోగిస్తారో అనేది.

Advertisement
You May Also Like These
Advertisement