‘గరుడవేగ’ సినిమా కోసం తమ వద్ద అప్పు చేసి, తరువాత మోసం చేశారని జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) దంపతులపై జోస్టార్ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వర్‌రాజు ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) స్పందించారు. ఆ విమర్శలకు వివరణ కూడా ఇచ్చారు. ఈ అంశం గురించి రెండు నెలలుగా కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. ఇప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. కోటేశ్వర్‌రాజు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని, తామెలాంటి తప్పు చేయలేదని జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) వెల్లడించారు.
జోస్టార్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కేసులో కోర్టు రెండు నెలల క్రితమే వారెంట్ ఇచ్చిందని జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) తెలిపారు. అయితే ఇప్పటివరకు తనకు ఎలాంటి సమన్లు అందలేదని చెప్పారు. మా గౌరవానికి ఎవరూ భంగం కలిగించలేరని అన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న వారేమీ మహాత్ములు కారని, తప్పు చేస్తే ఒప్పుకుంటానని చెప్పారు. తప్పు తమవైపు లేకుంటే దేవుడినైనా ఎదిరిస్తానని జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) స్పష్టం చేశారు. ఆరోపణలను ఆధారంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ చానెళ్లు పెడుతున్న థంబ్‌నైల్స్ చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు.
అసలేం జరిగింది?
హీరో రాజశేఖర్ (Rajashekar) దంపతులపై చెక్ బౌన్స్ కేసు నమోదు చేసినట్టు జోష్టర్ ఫిలింస్ తెలిపింది. గరుడవేగ సినిమా కోసం తమ సంస్థ నుంచి రూ.26 కోట్లు అప్పుగా తీసుకున్నారని ఆరోపణలు చేశారు సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు తెలిపారు. కేసు నమోదు చేయడంతో నగరి కోర్టు ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని చెప్పారు.
సంస్థ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ రాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చినట్టు వెల్లడించారు. అప్పు తీసుకున్న డబ్బును బినామీ పేర్ల మీదకు మార్చుకుని రాజశేఖర్ (Rajashekar) దంపతులు తనను మోసం చేశారని అన్నారు. హీరో రాజశేఖర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని కోటేశ్వరరాజు చెప్పారు.
ఇక, చాలాకాలం తర్వాత రాజశేఖర్ (Rajashekar) హీరోగా నటించిన గరుడవేగ సినిమాకు ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొననున్నట్టు ప్రకటించింది. కూతురుతో కలిసి శేఖర్ అనే సినిమాలో రాజశేఖర్ (Rajashekar) నటిస్తున్నారు.
Follow Us