12 Years For Orange: రామ్ చరణ్(Ram Charan) నటించిన 'ఆరెంజ్' సినిమా టాప్ 10 ఆసక్తికర విశేషాలు..

రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'ఆరెంజ్' సినిమాను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా మిగిలింది.

12 Years For Orange: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'ఆరెంజ్' సినిమా విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతుంది. 2010 నవంబర్ 26 తేదీన 'ఆరెంజ్' సినిమా రిలీజ్ అయింది. రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రామ్ చరణ్‌ కెరీయర్‌లో డిజాస్టర్‌గా మిగిలింది.  'ఆరెంజ్' సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన రామ్ చరణ్ బాబాయి నాగబాబుతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన అల్లు అరవింద్ కూడా భారీగా నష్టపోయారు. ఆరెంజ్ సినిమా గురించిన టాప్ 10 ఆసక్తికర విశేషాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

ఆరెంజ్ సినిమా టాప్ 10 ఆసక్తికర విశేషాలు

  • ఆరెంజ్ (Orange) సినిమా 2010 నవంబర్ 26 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్ చరణ్ నటించిన మూడవ చిత్రం 'ఆరెంజ్'. ఈ సినిమాలో రామ్ చరణ్ లవర్ బాయ్‌గా కొత్త పాత్రలో కనిపించారు.
  • మొదటి సినిమా బొమ్మరిల్లుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాస్కర్ 'ఆరెంజ్' చిత్రాన్ని తెరకెక్కించారు. 
  • ప్రేమించే కాలం ఎక్కువ అయ్యే కొద్ది ప్రేమ తగ్గుతుందనే ఓ యువకుడికి ప్రేమ పట్ల ఉన్న ఆలోచనపై సాగిన కథతో 'ఆరెంజ్' సినిమాను చిత్రీకరించారు. నిజమైన ప్రేమ ఆ యువకుడిలో తెచ్చిన మార్పులను కొత్త తరం వారికి తెలిసేలా వెండితెరపై చూపించారు దర్శకుడు భాస్కర్.
  • రామ్ చరణ్‌కు జోడిగా హీరోయిన్ జెనీలియా నటించారు. జెనీలియా నటన అందరినీ ఆకట్టుకుంది. 
  • ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ బాబాయి కొణిదెల నాగబాబు నిర్మించారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.40 కోట్లను ఖర్చు చేశారు.
  • 'ఆరెంజ్' పాటలు అప్పటికీ.. ఇప్పటికీ హిట్‌గా నిలిచాయి. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఆరెంజ్ సినిమాకు సంగీతం అందించారు. "సిడ్ని నగరం",   "చిలిపిగా", "నెను నువ్వంటు" , "హలో రమ్మంటే" , "ఓ'రేంజ్", "రూబా రూబ" పాటలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 
  • ప్రముఖ భారతీయ మోడల్, నటి అయిన షాజాన్ పదమ్సీ 'రూబా రూబ' సాంగ్‌లో నటించారు. శ్రీలంక నటి పూజా ఉమాశంకర్ ప్రత్యేక పాత్రలో 'ఆరెంజ్' చిత్రంలో నటించారు.
  • ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభు, నాగబాబు, మురళీ శర్మ, నవదీప్, బ్రహ్మానందం, గాయత్రీ రావు, కల్పిక గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
  •  'ఆరెంజ్' సినిమాకు సురేంద్ర కృష్ణ , కేదార్నాథ్ పరిమి, వనమాలి, రామజోగయ్య శాస్త్రిలు లిరిక్స్ అందించారు.
  • ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించింది. 'ఆరెంజ్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.50 కోట్లు జరిగింది.

Read More: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవరు.. ట్రెండ్ సెట్ చేస్తారు!

You May Also Like These