తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ బ‌హుమ‌తి ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy)

సకుటుంబ సపరివార సమేతంగా, ఆహ్వానం చిత్రాలకు ఉత్తమ దర్శకునిగా కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy)కి నంది బహుమతులు లభించాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీ మెచ్చిన ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) . ద‌ర్శ‌క‌త్వంతో పాటు ర‌చ‌యిత‌, న‌టుడు, సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. నిర్మాత అచ్చిరెడ్డితో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ప్ర‌తీ సినిమా దాదాపు హిట్‌గా నిలిచింది. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల కాంబినేష‌న్ అంటేనే సూప‌రో సూప‌ర్ అని అప్ప‌ట్లో అనుకునేవారు. కామెడీ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచిన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ఆయ‌న గురించిన మ‌రిన్ని విశేషాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం..

హీరోగా మారాల‌ని మ‌ద్రాసు వెళ్లిన ఎస్వీ కృష్ణారెడ్డి
ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) అస‌లు పేరు సత్తి వెంకటకృష్ణా రెడ్డి. జూన్‌ 1, 1961న తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి దగ్గరలో వున్న కొంకుదురులో జ‌న్మించారు. తండ్రి వెంకటరెడ్డి తల్లి సుబ్బాయమ్మ. భీమవరం డి.ఎన్‌.ఆర్‌.కాలేజిలో ఎం.కాం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేశారు. చ‌దువుకునే రోజుల్లోనే కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి మంచి స్నేహితులు. సినిమాలంటే కృష్ణారెడ్డికి చాలా ఇష్టం.. డిగ్రీ పూర్తి కాగానే న‌టుడు కావాల‌ని మద్రాసు వెళ్ళారు. 

కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) మ‌ద్రాసు వెళ్లి సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించారు. ప‌గ‌డాల ప‌డ‌వ అనే సినిమాలో ఓ పాత్ర‌లో న‌టించారు. కానీ ఆ సినిమా విడుద‌ల కాలేదు. దీంతో వెనుదిరిగారు. కృష్ణారెడ్డికి సినిమాల‌పై ఉన్న ఆశ‌క్తి చూసి స్నేహితుడు అచ్చిరెడ్డి నిర్మాత‌గా మారారు. కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అచ్చిరెడ్డి నిర్మాణంలో ఎన్నో సినిమాల‌ను రిలీజ్ చేశారు.

ఏనుగుతో యాక్టింగ్ చేయించిన ఎస్వీ కృష్ణారెడ్డి
కృష్ణారెడ్డి కామెడీ నేప‌థ్యంలో రాజేంద్ర ప్ర‌సాద్ హీరోగా కొబ్బ‌రిబోండాం సినిమాను తీశారు. మొదటిసారిగా ఈ సినిమాకు కథ, చిత్రానువాదం, సంగీతాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి అందించారు. కొబ్బ‌రి బోండాం హిట్ అవ‌డంతో ఆ త‌ర్వాత సినిమా కిశోర్‌ రాఠీ సమర్పణలో మనీషా ఫిలిమ్స్‌ పతాకం మీద రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమా తీశారు.  ఈ సినిమా బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచి కృష్ణారెడ్డిని దర్శకుడిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కించింది. ఏనుగు చెయ్యగల పనులకు అనుగుణంగా సన్నివేశాలను చిత్రీక‌రించి కామెడీని పండించారు కృష్ణారెడ్డి. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

ఘ‌టోత్క‌చుడిని సృష్టించిన కృష్ణారెడ్డి
సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో నంబ‌ర్ వ‌న్ సినిమా తీశారు. క‌మెడియ‌న్ అలీతో య‌మ‌లీల తీసి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టారు. ఇక శుభ‌ల‌గ్నం, ఊయ‌ల‌, వినోదం, పెళ్లి పీట‌లు,  సర్దుకుపోదాం రండి వంటి ఎన్నో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచారు. ఉగాది సినిమాతో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా వెండితెర‌పై మెరిశారు. ఘటోత్కచుడు సినిమా ఓ స‌రి కొత్త క‌థ‌తో తెర‌కెక్కించిన ఘ‌న‌త కృష్ణారెడ్డిదే. సకుటుంబ సపరివార సమేతంగా, ఆహ్వానం చిత్రాలకు ఉత్తమ దర్శకునిగా కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy)కి నంది బహుమతులు లభించాయి. అమెరికన్‌ దర్శకుల సమాజంలో కృష్ణారెడ్డి సభ్యులుగా వున్నారు.

 

మ‌రోసారి వెండితెర‌పైకి ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు
ప్ర‌స్తుతం కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) య‌మ‌లీల టీవీ సిరిస్ చేసి బుల్లితెరపై మెరిశారు. బిగ్ బాస్ ఫేం సోహెల్‌తో ఆర్గానిక్ మామా - హైబ్ర‌డ్ అల్లుడు సినిమాతో ఎస్వీ కృష్ణారెడ్డి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. 

You May Also Like These