Advertisement

Megastar Chiranjeevi: 'లాల్‌ సింగ్‌ చడ్డా' (Laal Singh Chaddha) ప్రీమియర్ షోలో పాల్గొన్న అమీర్ ఖాన్, చిరంజీవి

బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన తాజా చిత్రం 'లాల్‌ సింగ్‌ చడ్డా' (Laal Singh Chaddha). వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించారు. 

'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సమర్పిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య, కరీనా కపూర్ నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాబోతోంది. 

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) సినిమా మూడు రోజులలో విడుదల కానున్న తరుణంలో ఏఎమ్‌బి సినిమాస్‌లో ప్రీమియర్‌ షో వేయడం జరిగింది. ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి, అమిర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున‌ (Akkineni Nagarjuna), నాగ‌చైతన్య‌, మెగానిర్మాత అల్లు అర‌వింద్, యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కార్తికేయ‌, ద‌ర్శ‌కులు మారుతి, హ‌రీష్ శంక‌ర్, నిర్మాత‌లు సురేశ్ బాబు త‌దిత‌రులు హాజ‌రయ్యారు.  

ప్రీమియ‌ర్ షో (Laal Singh Chaddha Premier Show) అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. "లాల్‌ సింగ్‌ చడ్డా" అందరికీ నచ్చే సినిమా అని తెలిపారు. అమీర్‌ ఖాన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశం గర్వించదగ్గ నటుడని కొనియాడారు. ఇక నాగ చైతన్య పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో చైతు పాత్ర కీలకం. మంచి సినిమాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని మ‌నఃస్పూర్తిగా న‌మ్ముతున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.  

Read More: Laal Singh Chaddha: అమీర్ ఖాన్ (Aamir Khan) నడక, నడవడిక నాకు ఎంతో ఇష్టం... మెగాస్టార్ చిరంజీవి!

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement