RRR : "ఆర్ఆర్ఆర్" కొత్త రికార్డు - జపాన్ దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన రాజమౌళి సినిమా

రాజమౌళి ప్రమోషన్లు, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను మెచ్చిన జపనీయులు ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు.

తెలుగు సినిమా 'రౌద్రం, ర‌ణం, రుధిరం' (RRR) భారతీయ సినిమా ప్రపంచంలో ఓ మైలురాయిగా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాను జపాన్ దేశంలో విడుదల చేశారు.  రాజమౌళి ప్రమోషన్లు, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను మెచ్చిన జపనీయులు ఆర్ఆర్ఆర్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రాబట్టిన కలెక్షన్లపై పింక్ విల్లా ప్రత్యేక కథనం. 

  • 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా జపాన్ దేశంలో అక్టోబర్ 21 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు.
  • జపాన్ దేశంలో ప్రమోషన్ల కోసం రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వెళ్లారు. వీరితో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా వెళ్లారు. 
  • 'ఆర్ఆర్ఆర్' తెలుగు వర్షన్ ను జపాన్ లో 250 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
  • ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో 'ఆర్ఆర్ఆర్' సినిమా జపాన్ లో ప్రదర్శితమవుతోంది. జపాన్ ప్రేక్షకులు రాజమౌళి దర్శకత్వానికి ఫిదా అవుతున్నారు. 
  • జపాన్ లో విడుదలైన 21 రోజుల్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూ. 12.47 కోట్లను వసూళ్లు చేసింది. 
  • ఇప్పటివరకు జపాన్ దేశంలో విడుదలైన తెలుగు సినిమాల్లో కలెక్షన్ల పరంగా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రౌద్రం రణం రుథిరం (ఆర్ఆర్ఆర్) కొత్త రికార్డు నెలకొల్పింది. 
  • 'బాహుబలి 2' సినిమా ఇప్పటి వరకు లక్షా ఇరవై వేల మందికి పైగా జపనీయులు చూశారు. ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు 'ఆర్ఆర్ఆర్' సిద్ధమవుతోంది. 
  • 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రాన్ని ఇప్పటివరకు జపాన్ దేశంలో లక్షా ఇరవై వేలకు పైగా మంది చూశారు. ఈ వీకెండ్ లో మరో 20 వేల మంది చూసే అవకాశం ఉంది. 
  • మరో వారంలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీగా ఉంది. అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగానే కాకుండా ఎక్కువమంది వీక్షించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలవనుంది. 
  • 'ఆర్ఆర్ఆర్'  సినిమాను జపాన్ దేశస్తులు విపరీతంగా ఆదరిస్తున్నారు. రాజమౌళి జపనీయుల భాషలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
  • ప్రస్తుతం జపాన్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవడంతో 'ఆర్ఆర్ఆర్' స్రీన్లను సంఖ్యను తగ్గించారు. కొన్ని రోజుల్లో మళ్లీ ఈ స్క్రీన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి మూవీ క్రిటిక్స్ చెబుతున్నారు. రాజమౌళి సఆర్ఆర్ఆర్ 2స (RRR 2) కూడా రూపొందించే ఆలోచన ఉందని రీసెంట్ గా చేసిన కామెంట్లు ప్రస్తుతం జపాన్ లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. 

Read More: 'ఆర్ఆర్ఆర్‌' (RRR) ను ఆస్కార్‌కు ఎందుకు నామినేట్ చేయ‌లేదు : నెటిజన్లు

Credits: Twitter
You May Also Like These